Friday, April 26, 2024
Friday, April 26, 2024

దర్యాప్తు ఇంకెంతకాలం?

. విచారణాధికారిని మార్చండి
. వివేకా హత్య కేసుపై సుప్రీం మళ్లీ ఆగ్రహం

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును ఇంకెంతకాలం కొనసాగిస్తారని సీబీఐ అధికారులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వెలిబుచ్చింది. ఈ కేసులో ఇంతవరకు ఎలాంటి పురోగతి కనిపిం చడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. హత్యకు గల ప్రధాన కారణాలు, ఉద్దేశాలను బయట పెట్టాలని, ఇందుకోసం విచార ణాధికారిని మార్చడమో… మరో అధికారిని నియమించడమో చేయాలని ఆదేశించింది. వివేక హత్యకేసు దర్యాప్తు చేస్తున్న అధికారిని మార్చాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది.
దర్యాప్తు వేగంగా సాగటం లేదని, ఈ కేసును విచారించే అధికారులను మార్చాలని కోరుతూ ఈ కేసులో ఐదో నిందితుడు శివశంకర్‌ రెడ్డి భార్య తులశమ్మ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ నిర్వహించిన సర్వోన్నత న్యాయ స్థానం… వివేక హత్య కేసును ఇంకెంత కాలం విచారణ చేస్తారని ప్రశ్నించింది. కేసు ఆసాంతం రాజకీయ దురుద్దేశంతో కూడినదేనని రిపోర్ట్‌లో రాశారని జస్టిస్‌ ఎంఆర్‌ షా పేర్కొ న్నారు. అయితే చెప్పిందే చెపుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దోషులను పట్టుకునేం దుకు మీరు చెప్పే ఈ కారణాలు సరిపోవు. 2021నుంచి ఈ కేసులో ఎలాంటి పురోగతి కానరా వడం లేదు. ఇంకా ఎన్ని సంవత్సరాలు కావాలి? ప్రస్తుత సీబీఐ అధికారి తీరును చూస్తే ఈ కేసును ఇప్పట్లో ముగించే పరిస్థితి కనిపించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. వివేక హత్య కేసులో పెద్ద కుట్ర ఉందని హైకోర్టు అభిప్రాయ పడిరది. ఈ కుట్రను బయటకు తీయాల్సిన అవసరం ఉంది. అందువల్ల విచారణాధికారిని మార్చాలని, ఇప్పుడున్న అధికారిని కూడా కొనసాగించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్‌ 10వ తేదీకి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img