Friday, April 26, 2024
Friday, April 26, 2024

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

ఒమిక్రాన్‌ వేళ..ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించవద్దంటున్న ప్రభుత్వం

దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. దేశంలో 7 వేల దిగువకు రోజువారీ కరోనా కేసులు నమోదయ్యాయి. . గడిచిన 24 గంటల్లో సోమవారం దేశవ్యాప్తంగా 6,990 కేసులు నమోదయ్యాయి. 551 రోజుల తర్వాత కేసుల సంఖ్య ఈ స్థాయిలో నమోదయ్యాయి. ు కాగా, 190 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 1,00,54 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.ఏడాదిన్నర తర్వాత క్రియాశీల కేసుల సంఖ్య భారీగా తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలో మార్చి తర్వాత రికవరీ రేటు గణనీయంగా పెరుగుతూ వస్తోంది.తాజాగా నమోదైన గణాంకాలతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,45,87,822 కి చేరగా.. మరణాల సంఖ్య 4,68,980 కి పెరిగాయి. కాగా నిన్న కరోనా నుంచి 10,116 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 3,40,18,299 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది.దేశంలో ఇప్పటి వరకు 123.25 కోట్లకు పైగా కొవిడ్‌ టీకా డోసుల పంపిణీ జరిగింది.ఇప్పటివరకు దేశంలో 64.13 కోట్ల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు కేంద్రం వెల్లడిరచింది. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా అదుపులోనే ఉన్నా..ఒమిక్రాన్‌ వేరియంట్‌ భయాందోళన కలిగిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇది మరో ముప్పుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. అందుకే కేసులు తగ్గుతున్నా..ప్రజలు మాత్రం అలసత్వం ప్రదర్శించవద్దని అధికారులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img