Friday, April 26, 2024
Friday, April 26, 2024

పుంజుకున్న రూపాయి.. 71 పైసలు పెరిగి 80.69కి చేరుకున్న భారత కరెన్సీ..

భారత కరెన్సీ రూపాయి బలపడిరది. శుక్రవారం ప్రారంభ ట్రేడిరగ్‌లో అమెరికన్‌ కరెన్సీతో రూపాయి 71 పైసలు పెరిగి 80.69కి చేరుకుంది. డాలర్‌ ఇండెక్స్‌ పతనంతో పాటు యూఎస్‌ సిపిఐ తగ్గడంతో రూపాయి బలపడిరది. సానుకూల దేశీయ ఈక్విటీలు, ముడి చమురు ధరలలో క్షీణత వంటి అంశాలు కూడా రూపాయికి మద్దతు ఇచ్చాయని ఫారెక్స్‌ వ్యాపారులు తెలిపారు. ఇంటర్‌బ్యాంక్‌ విదేశీ మారకం వద్ద, దేశీయ రూపాయి డాలర్‌తో పోలిస్తే 80.76 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత 80.69కి చేరుకుంది. 1947లో రూ.3.30 గురువారం అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 7 పైసలు పెరిగి 81.40 వద్ద ముగిసింది. 1947లో డాలర్‌తో రూపాయి మారకపు విలువ మూడు రూపాయల 30 పైసలుగా ఉండేది. ఆ తర్వాత రూపాయి విలువ పడిపోతూ రూ.80.69కి చేరుకుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img