Friday, April 26, 2024
Friday, April 26, 2024

మహిళా రిజర్వేషన్‌ సాధించే వరకు విశ్రమించం

బీఆర్‌ఎస్‌ నేత కవిత స్పష్టీకరణ ` దిల్లీలో నిరాహార దీక్ష

. వామపక్షాలతో సహా 18 పార్టీల మద్దతు
. చివర్లో నిమ్మరసం ఇచ్చిన సీపీఐ కార్యదర్శి నారాయణ

న్యూదిల్లీ : మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించేంత వరకు విశ్రమించేది లేదని బీఆర్‌ఎస్‌ నేత కె.కవిత తేల్చిచెప్పారు. మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్‌ కల్పన డిమాండ్‌తో ఆమె దేశ రాజధాని దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద శుక్రవారం ఆరు గంటల నిరాహార దీక్ష చేశారు. ఈనెల 13 నుంచి పార్లమెంటులో బడ్జెట్‌ సమావేశాలు జరగనున్న క్రమంలో సుదీర్ఘంగా పెండిరగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించాలని కేంద్రప్రభుత్వానికి ఆమె సూచించారు. దీక్షను సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభించారు. ఈసారి పార్లమెంటు సమావేశాల్లో మహిళా బిల్లును ప్రవేశపెట్టాల్సిందేనన్నారు. తొమ్మిదేళ్లుగా ఇది పెండిరగ్‌లో ఉందని, ఎంతో కష్టపడితే పంచాయతీల్లో మహిళలకు రిజర్వేషన్‌ను ప్రభుత్వం కల్పించిందని, ఇప్పుడు చట్టసభల్లోనూ కల్పించాలని అన్నారు. మహిళలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సమానత్వం లేకపోతే దేశం పురోగతి సాధించలేదని ఏచూరి అన్నారు. సాయంత్రం 4 గంటల వరకు కవిత తన దీక్షను కొనసాగించారు. ఆమెకు సీపీఐ కార్యదర్శి నారాయణ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అనంతరం కవిత మాట్లాడుతూ ప్రపంచం అభివృద్ధి చెందుతున్న గతిలో భారత్‌ కూడా అభివృద్ధి సాధించాలంటే రాజకీయాల్లో మహిళలు కీలక పాత్ర పోషించాలని అన్నారు. అందుకోసం 27ఏళ్లుగా పెండిరగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్‌ బిల్లు కీలకమన్నారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్‌ సాధించే వరకు విశ్రమించేది లేదన్నారు. అవసరమైతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. మహిళా బిల్లు ఓ చారిత్రక అవసరం, దానిని సాధించి తీరాల్సిందేనని కవిత అన్నారు. దీక్షకు మద్దతు ఇచ్చిన పార్టీల నేతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శ్యామ్‌ రజక్‌ (ఆర్జేడీ) మాట్లాడుతూ మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం సముచితంగా లేనంత వరకు భారత ప్రజాస్వామ్యం బలోపేతం కాలేదన్నారు. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళా రిజర్వేషన్‌ 33శాతం ఉండాలని నొక్కిచెప్పారు. దీక్షలో కె.నారాయణ(సీపీఐ), సీమా శుక్లా (ఎస్పీ), సంజయ్‌ సింగ్‌, చిత్రా సర్వర (ఆప్‌), నరేశ్‌ గుజ్‌రాల్‌ (అకాలీదళ్‌), అంజుమ్‌ జావేద్‌ మీర్జా (పీడీపీ), షామి ఫిర్దోస్‌ (ఎన్‌సీ), సుష్మిత దేవ్‌ (టీఎంసీ), కేసీ త్యాగి (జేడీయూ), సీమా మలిక్‌ (ఎన్‌సీపీ), ప్రియాంక చతుర్వేది (శివసేన), కాంగ్రెస్‌ మాజీ నేత కపిల్‌ సిబల్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మహిళ నేతలు పాల్గొన్నారు. మొత్తం 18 పార్టీలు సంఫీుభావం ప్రకటించాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img