Friday, April 26, 2024
Friday, April 26, 2024

మోదీ..పంజాబ్‌కు రావద్దు

ఎస్‌కేఎం నేతృత్వ రైతు ఆందోళనలు
ఆశీశ్‌ మిశ్రాకు బెయిల్‌పై మండిపాటు
అన్నదాతలపై కేసుల ఉపసంహరణకు డిమాండు
అపరిష్క ృత ‘సాగు’ హామీల అమలు ఎప్పుడంటూ నిలదీత

జలంధర్‌: తమకిచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం కావడమే కాకుండా రైతుల్ని తన కారుతో తొక్కించి చంపిన ఆశీశ్‌ మిశ్రాకు బెయిల్‌ ఇప్పిం చడంపై సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) మండిపడిరది. ప్రధాని మోదీని పంజాబ్‌లో అడుగు పెట్టవద్దు అని హెచ్చరిస్తోంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన అక్కడ ప్రచారంలో పాల్గొంటున్న క్రమంలో నిరసనాం దోళలను చేపట్టింది. ఈనెల 16న పఠాన్‌కోట్‌లో 18న అబోహర్‌లో శాంతి యుతంగా మోదీ పర్యటనకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహి స్తామని ఎస్‌కేఎం నేతలు అన్నారు. వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేసిన తర్వాత పంజాబ్‌ గడ్డపై మోదీ అడుగుపెట్టడం ఇది రెండవ సారి. జనవరి 5న ఫిరోజ్‌పూర్‌లో నిర్వహించిన బీజేపీ ర్యాలీకి ఆయన హాజరు కావాల్సి ఉండగా అలా జరగకపోవడం వివాదానికి తెరతీసింది. బీజేపీ సీని యర్‌ నేతలు అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, మనోహర్‌ లాల్‌ కట్టర్‌, జేపీ నడ్డా పంజాబ్‌ పర్యటనలను నిరసిస్తూ నల్ల జెండాలు ప్రదర్శించాలని ఎస్‌కేఎం నేతలు నిర్ణయిం చారు. ఈ మేరకు పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. క్రాంతికారీ కిసాన్‌ యూనియన్‌, పంజాబ్‌ అధ్యక్షుడు దర్శన్‌ పాల్‌ మాట్లాడుతూ, ఆశీశ్‌ మిశ్రాకు బెయిల్‌ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అతని తండ్రి అజయ్‌ మిశ్రా తేని కేబినెట్‌ మంత్రిగా రాజీనామా చేయకపోవడం, ఫిరోజ్‌ పూర్‌లో మోదీ పర్యటనను వ్యతిరేకించిన రైతులకు వేధింపులు, ఎంఎస్‌పీపై కమిటీ ఏర్పాటులో మోదీ ప్రభుత్వం వ్యతిరేకంగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నామన్నారు. యూపీ, హరియాణా, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌లో రైతులపై పెండిరగ్‌ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండు చేస్తున్నట్లు పాల్‌ వెల్లడిరచారు. 14న అన్ని గ్రామాల్లో మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశా మన్నారు. పంజాబ్‌లో 16వ తేదీన జిల్లా, మండలి స్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. తమ హామీల అమలుపై ప్రధాని మోదీ నిర్ణయం తీసుకుంటే ఆందోళనలను విరమించుకుంటామని దర్శన్‌ పాల్‌ చెప్పారు.
బీకేయూ క్రాంతికారి అధ్యక్షుడు సూర్జిత్‌ సింగ్‌ ఫూల్‌ మాట్లాడుతూ, లఖింపూర్‌ కేసులో ఆశీష్‌ మిశ్రాను దోషిగా సుప్రీం కోర్టు పర్యవేక్షిత సిట్‌ తేల్చింది. అతనిపై ఎఫ్‌ఐఆర్‌లో తీవ్రమైన ఆరోపణలు నమోదయ్యాయి. మరి బెయిల్‌ ఎలా వచ్చింది. మా పుండుపై ప్రభుత్వం కారం చల్లుతోందని సూర్జిత్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ ఫిరోజ్‌పూర్‌ పర్యటనను వ్యతిరేకించిన రైతులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని చెప్పారు. ఫిరోజ్‌పూర్‌ జిల్లాలోని కుల్గది పోలీసుస్టేషన్‌లో గుర్తుతెలియని 150 మందిపై ఎఫ్‌ఐఆర్‌లను పోలీసులు నమోదు చేశారన్నారు. బెయిల్‌ కోసం రైతులపై పంజాబ్‌ పోలీసులు ఒత్తిడి తెస్తున్నట్లు తెలిపారు. బెయిల్‌ కోసం అర్జీ పెట్టేందుకు నిరాకరించినట్లు చెప్పారు. తమ యూనియన్‌ నాయకులను అరెస్టు చేస్తే ఉద్యమబాట పడతామని హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ఓటు వేయొద్దు అన్న ప్రచారంతో ముడి పడి ఉన్న హరియాణా రైతు సంఘం నాయకుతు తేజ్వీర్‌ సింగ్‌ స్పందించారు. ఆశీష్‌ మిశ్రాకు బెయిల్‌ మంజూరు కావడంతో ఎస్‌కేఎం పిలుపు మేరకు మోదీ పర్యటనను నిరసిస్తామన్నారు. యూపీలోనూ బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నట్లు తెలిపారు. బీకేయూ నేత రాకేశ్‌ తికైత్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. మిశ్రాకు బెయిల్‌ ఇస్తున్నట్లు అలహాబాద్‌ హైకోర్టు తీర్పునిచ్చిన మరుసటి రోజునే సోమవారం మోదీ జలంధర్‌ పర్యటనను అడ్డుకుంటామని ఎస్‌కేఎం నాయకులు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img