Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

రాజీవ్‌ ఖేల్‌రత్న అవార్డు పేరు మార్పు

ఇకపై మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డు
క్రీడాకారులకు ఇచ్చే అత్యుత్తమ పురస్కారం రాజీవ్‌ ఖేల్‌రత్న పేరును కేంద్ర ప్రభుత్వం మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ పురస్కారాన్ని మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డుగా మార్పు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. ఈ అవార్డు పేరును మార్చాలని తనకు దేశవ్యాప్తంగా పౌరుల నుంచి అనేక వినతులు వచ్చాయని, అందుకే పేరు మార్చాల్సి వచ్చిందని ప్రధాని పేర్కొన్నారు. ఈ మేరకు మోడీ ట్విటర్‌లో వెల్లడిరచారు. భారత్‌లో ఈ అత్యున్నత పురస్కారాన్ని మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జ్ఞాపకార్థంగా 1991`92లో ప్రారంభించారు. అప్పటి నుంచి దాన్ని రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డుగా పరిగణిస్తున్నారు. ఇప్పుడు ఆ పేరు మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్నగా మారింది. ఆగస్ట్‌ 29ని ఇప్పటికే జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ క్రీడా అత్యున్నత పురస్కారం కూడా ధ్యాన్‌చంద్‌ పేరుతోనే ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img