Friday, April 26, 2024
Friday, April 26, 2024

రాజ్యాంగ దినోత్సవంగా రిపబ్లిక్‌ డే

లౌకికవాద పరిరక్షణ దినంగా గాంధీ వర్థంతి
పార్టీ శ్రేణులకు సీపీఐ పిలుపు

న్యూదిల్లీ: గణతంత్ర దినోత్సవాన్ని (జనవరి 26) రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని, గాంధీ వర్థంతి (జనవరి 30)ని లౌకికవాద పరిరక్షణ దినంగా పాటించాలని పార్టీశ్రేణులకు భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ప్రధాన కార్యదర్శి డి.రాజా పిలుపునిచ్చారు. భారతదేశం లౌకికసంక్షేమఫెడరల్‌ రాజ్యమని రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేద్కర్‌ పేర్కొనడాన్ని తాజా ప్రకటనలో గుర్తుచేశారు. రాజ్యాంగం మూలాలపై బీజేపీఆర్‌ఎస్‌ఎస్‌ దాడి చేస్తున్నాయన్నారు. విభజనవర్గీకరణఫాసిస్టు అజెండాతో దేశాన్ని భ్రష్టుపట్టిస్తున్నాయని విమర్శించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం కృషిచేయాలని, దీనిపై ప్రజలను చైనత్యవంతులు చేయాలని పార్టీ శాఖలకు డి.రాజా పిలుపునిచ్చారు. జనవరి 26న పార్టీ కార్యాలయాలన్నింటిలో జాతీయ పతాకావిష్కరణ జరగాలని సూచించారు. స్వాతంత్ర పోరాటంలో, గణతంత్రాన్ని సాధించడంలో పార్టీ పాత్ర గురించి ప్రజలకు తెలిసే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రాజ్యాంగ పీఠికను చదివి ప్రతిజ్ఞ చేయాలని డి.రాజా తెలిపారు. జనవరి 30 గాంధీ వర్థంతని, ఆ రోజు యావత్‌ దేశం ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తుందన్నారు. స్వాతంత్య్ర పోరాటంలోనే కాకుండా దేశానికి గణంతంత్రాన్ని సాధించడంలో గాంధీ కీలకపాత్ర పోషించారన్నారు. హిందూముస్లిం ఐక్యత, దేశంలో మతసామరస్యం సందేశాన్నే ఆయన ఇచ్చారని గుర్తుచేశారు.
బీజేపీఆర్‌ఎస్‌ఎస్‌ దేశ ప్రజలలో విద్వేషాన్ని రెచ్చగొడుతూ మతంకులం పేరిట ఘర్షణలు సృష్టిస్తూ ముస్లింలలో అభద్రతా భావాన్ని పెంచుతూ, దళితులు, గిరిజనులతో పాటు ఇతర మైనారిటీల్లో భయోత్పాతాన్ని సృష్టిస్తున్న వేళ జనవరి 30వ తేదీని లౌకికవాద పరిరక్షణ దినోత్సవంగా జరపాలని పార్టీ శాఖలకు డి.రాజా పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img