Friday, April 26, 2024
Friday, April 26, 2024

సహజ రీతిలో వ్యవసాయాన్ని ఓ ఉద్యమంలా చేపట్టాలి : ప్రధాని మోదీ

సహజ రీతిలో వ్యవసాయాన్ని ఓ ఉద్యమంలా చేపట్టేందుకు అన్ని రాష్ట్రాలు ముందుకు రావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రకృతి సేద్యం వల్ల దేశంలోని 80 శాతం చిన్న తరహా రైతులకు లాభం చేకూరుతుందన్నారు. ఆగ్రో అండ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జాతీయ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ప్రధాని మోదీ వర్చువల్‌ ప్రసంగం చేశారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌, నేచురల్‌ ఫార్మింగ్‌ లాంటి అంశాలు వ్యవసాయ రంగాన్ని మార్చేస్తుందని అన్నారు. కెమిస్ట్రీ ల్యాబ్‌ల నుంచి సేద్యాన్ని దూరం చేయాలని, సాగును సహజ ల్యాబరేటరీకి తరలించాలన్నారు. సహజమైన ల్యాబ్‌ అంటే సైన్స్‌ ఆధారితమైందని, విత్తనాల నుంచి నేల వరకు.. అన్నింటికీ సహజ రీతిలో పరిష్కారాలు దొరుకుతాయని అన్నారు.సహజసిద్దమైన ఫెర్టిలైజర్లు వాడడం వల్ల బెనిఫిట్‌ ఎక్కువగా ఉంటుందని మోదీ అన్నారు. వ్యవసాయ రంగంలో ఉన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాన్నారు. పంట వ్యర్ధాలను కాల్చడం వల్ల భూసారాన్ని కోల్పోతామని నిపుణులు చెబుతున్నారని, కానీ పంట వ్యర్ధాలను కాల్చడం ఓ సాంప్రదాయం అయిపోయిందని ప్రధాని వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img