Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

రూ.225కే కోవాగ్జిన్‌, కోవిషీల్డ్‌ వాక్సిన్లు


ప్రభుత్వంతో చర్చల తర్వాతే ధరల తగ్గింపు
ఎస్‌ఐఐ, భారత్‌ బయోటెక్‌ ప్రకటన

న్యూదిల్లీ : కోవిడ్‌ వాక్సిన్‌ దిగ్గజ కంపెనీలు సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ), భారత్‌ బయోటెక్‌ శనివారం కీలక ప్రకటన చేశాయి. కోవిడ్‌ 19 వాక్సిన్‌ ప్రికాషన్‌ డోసు ధరను తగ్గించినట్లు తెలిపాయి. ప్రభుత్వంలో చర్చల తర్వాత ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకాను రూ.225కే అందించాలని నిర్ణయించినట్లు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడిరచాయి. కోవిషీల్డ్‌ వాక్సిన్‌ ధరను రూ.600 నుంచి రూ.225కు తగ్గించాలని ఎస్‌ఐఐ నిర్ణయించిందని సీఈవో అదర్‌ పూనావాలా ట్వీట్‌ చేశారు. అలాగే, కోవాగ్జిన్‌ టీకా ధరను రూ.1,200 నుంచి రూ.225కు తగ్గించినట్లు భారత్‌ బయోటెక్‌ సహ వ్యవస్థాపకురాలు, సంయుక్త ఎండీ సుచిత్రా ఎల్లా ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. అర్హులందరికీ ప్రికాషన్‌ డోసులు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. తమ వాక్సిన్‌లు అందరికీ అందుబాటులో ఉండాలనే ధర తగ్గించినట్లు వెల్లడిరచారు. ఇదిలావుంటే, దేశంలో 15 ఏళ్లు పైబడిన వారిలో 96 శాతం మంది కనీసం ఒక టీకా తీసుకున్నారని, 83 శాతం మంది రెండు టీకాలు పొందారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 2.5 కోట్ల ప్రికాషన్‌ డోసులను ఆరోగ్యసంరక్షణ కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 60ఏళ్లుపైబడిన వారికి ఇప్పటికే అందించినట్లు పేర్కొంది. 1214 ఏళ్ల వారిలో 45 శాతం మంది తొలి డోసు పొందినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img