Friday, April 26, 2024
Friday, April 26, 2024

6-12 ఏళ్ల వారికి కోవాగ్జిన్‌..

డీసీజీఐ కీలక అనుమతులు

దేశంలో టీకా పంపిణీని మరింత విస్తరిస్తూ పిల్లలకు వ్యాక్సిన్‌ ఇవ్వడానికి మార్గం సుగమమైంది. 6 నుంచి 12 ఏళ్ల లోపు వయస్సు పిల్లలకు అత్యవసర వినియోగం కింద కోవ్యాగ్జిన్‌కు అనుమతినిస్తూ నిర్ణయం ప్రకటించింది.. కోవిడ్‌ నాలుగో వేవ్‌ ఉంటుందని తీవ్ర ప్రచారం నేపథ్యంలో డీసీజీఐ తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడిరది. దీంతోపాటు 5 నుంచి 12 ఏళ్లలోపు వారికి బయోలాజికల్‌ఇ సంస్థ తయారుచేసిన కార్బెవాక్స్‌ టీకాను పంపిణీ చేసేందకు డీసీసీఐ అనుమతులిచ్చింది. ఈ మేరకు సంబంధిత వర్గాలు వెల్లడిరచాయి. 12 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు పిల్లల కోసం కోవ్యాగ్జిన్‌ అత్యవసర వినియోగానికి డీసీజీఐ గత డిసెంబర్‌ 24న అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. దీంతో పాటు 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ జనవరి 3 నుంచి ప్రారంభమైంది. ఇక%ౌౌ% దీంతో పాటు 5 -12 ఏళ్ల వారికి బయోలాజికల్‌ ఈ సంస్థ తయారు చేసిన కార్బేవ్యాక్స్‌ టీకాను ఇచ్చేందుకు డీసీజీఐ అనుమతినిచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img