Friday, April 26, 2024
Friday, April 26, 2024

వరదపోటు

ప్రమాదకరస్థాయిని మించి గోదావరి ప్రవాహం
నీటితో తొణికిసలాడుతున్న తుంగభద్ర
మరో రెండురోజులు వర్షాలు

విశాలాంధ్ర-రాజమహేంద్రవరం: వరద నీటితో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. రోజు రోజుకూ వరద ఉధృతి పెరుగుతుండగా పల్లపు ప్రాంతాలు చాలా వరకు జలమయ మయ్యాయి. భద్రాచలం వద్ద 51.60 అడుగుల నీటి మట్టంతో వరద ప్రవహిస్తుండగా ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను దాటి 15.20 అడుగుల నీటిమట్టంతో ప్రవాహం సాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నుంచి కాలువలకు 3వేల 500 క్యూసెక్కుల నీటిని విడిచి పెడుతున్నారు. 5 లక్షల 19 వేల 907 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ధవళేశ్వరంలో గడచిన వందేళ్లలో లేని విధంగా జులై రెండో వారంలోనూ 10 లక్షల క్యూసెక్కుల వరద నీరు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే అన్ని స్నానఘట్టాల వద్ద పటిష్ట రక్షణ ఏర్పాట్లు చేశారు. వరద సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసి గోదావరి లంకల్లో నివాసం ఉంటున్న వారిని ఆయా కేంద్రాలకు తరలించి భోజనం, వసతి సదుపాయం కల్పిం చారు. భద్రాచలం వద్ద అంతకంతకు గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. గోదావరి బ్యారేజ్‌ వద్ద రాత్రి ఏడు గంటలకు నీటి మట్టం 15.10 అడు గులు నమోదైంది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నీటి మట్టం పెరిగితే గురువారం నాటికి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.
నిండుకుండలా తుంగభద్ర నీటిని తుంగభద్ర నదికి విడుదల చేశారు. డ్యాంలో 99 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రాయబసవ కెనాల్‌కు 225 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఈనెల 15న ఎల్‌ఎల్‌సీ కాలువకు అధికారులు నీటిని విడుదల చేయనున్నారు. సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి డ్యామ్‌ నిండ డంతో ఆయకట్టు రైతులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆనందంగా ఉన్నారు. ఈ ఏడాది రెండో పంటకు నీళ్లు సంతృప్తిగా అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరో రెండురోజులు వర్షాలు
విశాఖపట్నం: ఇప్పటికే భారీగా కురుస్తున్న వర్షాలతో అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. దీనికి తోడు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో మరో రెండు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతా వరణ శాఖ అధికారులు తెలిపారు. వాయువ్య బంగాళా ఖాతం, దక్షిణ ఒడిశాలో తీవ్ర అల్పపీడనం కొనసాగు తున్నట్లు విశాఖపట్నం వాతావరణశాఖ అధికారులు వెల్లడిరచారు. దీనిపైన ఉపరితల ఆవర్తనం కొనసాగుతు న్నట్లు తెలిపారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరిం చారు. మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. మరో రెండు రోజులపాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందనీ, తీరం వెంబడి గంటకు 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఉత్తరాంధ్రలో రెండు రోజులుగా వర్షాలు తగ్గినప్పటికీ వరదనీటి ప్రవాహం అధికంగానే ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లా, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాం తంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల నుంచి ప్రజలు ఇంకా తేరుకోలేదు. మళ్లీ రెండు రోజుల పాటు వర్షాలు అన్న వార్తతో వారు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.


హోళగుంద: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు వరప్రదాయిని అయిన తుంగభద్ర డ్యామ్‌ బుధవారం పూర్తిస్థాయిలో నిండి నిండుకుండలా మారింది. డ్యాం ఎగువ భాగంలోని శివమొగ్గ, దావనగిరి, తీర్థహళ్లి, మోరల్‌ మలనాడులో కురుస్తున్న భారీ వర్షానికి డ్యాంకు 90,624 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. డ్యామ్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 1633 అడు గులు కాగా 1631 నీరు నిల్వ ఉంది. తుంగభద్ర డ్యామ్‌ పూర్తిస్థాయిలో నిండడంతో బోర్డ్‌ సెక్రటరీ నాగ మోహన్‌, ఎల్‌ఎల్‌సీ ఉన్నతాధికా రులు 28 గేట్లను అడుగు మేర ఎత్తి 39,243 క్యూసెక్కుల

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img