Friday, April 26, 2024
Friday, April 26, 2024

రుషికొండ తవ్వకాలపై ఎన్జీటీ స్టే

విశాఖ రుషికొండ తవ్వకాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు తవ్వకాలు జరపరాదని ఎన్జీటీ ఆదేశించింది. ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 6న ఎన్జీటీ బెంచ్‌ విచారణ జరిపింది. తవ్వకాలపై అధ్యయనానికి సంయుక్త కమిటీని నియమించింది. ఏపీ కోస్టల్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ నోడల్‌ ఏజన్సీగా వ్యవహరిస్తుందని స్పష్టంచేసింది. నెలరోజుల్లో కమిటీ నివేదిక ఆదేశించింది. ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రుషికొండ వద్ద చేపడుతున్న ప్రాజెక్టు పనులపై గత ఏడాదినే స్పందించింది. వాస్తవ పరిస్థితి తెలుసుకోడానికి నలుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటుకూ ఆదేశించింది. రుషికొండ వద్ద నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని, పర్యవరణానికి హాని వాటిల్లుతోందని ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎన్జీటీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img