దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 8 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా, నేడు కొత్తగా మరో 10,649 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసులు 4,43,68,195కు చేరాయి. ఇందులో 4,37,44,301 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,27,452 మంది మరణించారు. మరో 96,442 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల్లో 36 మంది కరోనాకు బలవగా, 10,677 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది.