Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

సకాలంలో రాని 108 – కడుపులోనే మృతిచెందిన చిన్నారి

విశాలాంధ్ర`హుకుంపేట (అల్లూరి జిల్లా) : ప్రభుత్వాలు ఎన్ని మాటలు చెప్పినా ఏజెన్సీ ప్రాంతంలో వైద్య సేవలు అందక ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. ప్రత్యేకించి గర్భిణీలు సకాలంలో ఆసుపత్రికి చేరకపోవడంతో తల్లి లేదా బిడ్డ, ఒక్కోసారి ఇద్దరూ ప్రాణాలు కోల్పోతున్నారు. 108 సైతం సకాలంలో సేవలు అందించలేకపోతోంది. తాజాగా డోలీలో గర్భిణీని తరలించినా చిన్నారి మృతి చెందిన సంఘటన అల్లూరి జిల్లా హుకుంపేట మండలంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో తీగలవలస పంచాయతీ పనసబంధ గ్రామానికి చెందిన వంతాల భానుకు మంగళవారం పురిటి నొప్పులు మొదలయ్యా యి. దీంతో భర్త నాగేశ్వరరావు, కుటుంబ సభ్యులు 108కి సమాచారం అందించారు. మూడు గంటలైనా అంబులెన్స్‌ రాలేదు. దీంతో పనస బంధ నుంచి డోలీ ద్వారా తీగలవలస రహదారి వరకు గర్భిణీని తీసు కొచ్చారు. అక్కడ నుంచి ఆటోలో హుకుంపేట ఆసుపత్రికి తరలించారు. కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని వైద్య సిబ్బంది అతి కష్టంపైన ప్రసవం చేశారు. అప్పటికే బిడ్డ మృతి చెందినట్లు తెలిపారు. సకాలంలో 108 వచ్చి ఉంటే బిడ్డ ప్రాణాలు దక్కేవని కుటుంబ సభ్యులు, గిరిజన సంఘ నాయకులు కృష్ణారావు, కొండలరావు ఆరోపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img