Friday, April 26, 2024
Friday, April 26, 2024

అమెరికా ఆర్థికసంస్థ డిప్యూటీ చీఫ్‌గా నిషా దేశాయ్‌

నామినేట్‌ చేసిన అధ్యక్షుడు బైడెన్‌
వాషింగ్టన్‌: అమెరికా ఆర్థిక సంస్థ డిప్యూటీ చీఫ్‌గా భారత సంతతికి చెందిన నిషా దేశాయ్‌ బిస్వాల్‌ను ఆ దేశాధ్యక్షుడు జో బిడెన్‌ నామినేట్‌ చేశారు. ఈ మేరకు వైట్‌ హౌస్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. 2013 నుంచి 2017 వరకు యుఎస్‌ స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన బిస్వాల్‌, అమెరికా, భారత్‌ సంబంధాలను మెరుగు పరచడంలో ప్రధానపాత్ర పోషించారు. అమెరికా ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కమిషన్‌లో అత్యున్నత పరిపాలనా స్థానానికి నిషా దేశాయ్‌ బిస్వాల్‌ను అధ్యక్షుడు బో బైడెన్‌ నామినేట్‌ చేసినట్లు శ్వేతసౌధం సోమవారం ప్రకటించింది. ఒబామా హయాంలో దక్షిణ, మధ్యాసియా వ్యవహారాల శాఖ సహాయ కార్యదర్శిగా పనిచేసిన నిషాకు విదేశాంగ విధానం, అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలోనూ 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం అమెరికా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నేతృత్వ ఇంటర్నేషనల్‌ స్ట్రాటజీ, గ్లోబల్‌ ఇనీషియేటివ్స్‌ కార్యక్రమానికి సీనియర్‌ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. భారత్‌, బంగ్లాదేశ్‌లకు సంబంధించి అమెరికా వాణిజ్య మండళ్లకూ నేతృత్వం వహిస్తున్నారు. అమెరికా ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌లో ఆసియాకు అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేశారు. దక్షిణ, మధ్య `ఆగ్నేయాసియా ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలను పర్యవేక్షించారు. యూనివర్సిటీ ఆఫ్‌ వర్జీనియాలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన నిషా ఆపై అంతర్జాతీయ సంబంధాలు, ఆర్థికశాస్త్రంలో మాస్టర్స్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img