Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఇరాన్‌లో దారుణం..విద్యకు దూరం చేసేందుకే బాలికలపై విషప్రయోగం..!

మంత్రి సంచలన వ్యాఖ్యలు
కొద్దినెలల క్రితం ఇరాన్‌లో జరిగిన దారుణం ఒకటి తాజాగా బయటకు వచ్చింది. బాలికలను విద్యను దూరం చేసేందుకు చేసిన ఘోర ప్రయత్నాల గురించి అక్కడి మంత్రి వెల్లడిరచారు. గత ఏడాది నవంబర్‌ నుంచి ఖోమ్‌, దక్షిణ టెహ్రాన్‌లో వందల మంది విద్యార్థునులకు శ్వాసకోశం విషపూరితమైనట్లు వైద్యులు గుర్తించారు. అనారోగ్యంపాలైన విద్యార్థుల తల్లిదండ్రులు ఈ నెల 14న క్వోమ్‌ సిటీ గవర్నరేట్‌ ముందు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై తాజాగా ఇరాన్‌ మంత్రి యునెస్‌ పనాహీ స్పందించారు. ఈ విషప్రయోగం కావాలనే జరిగినట్లు మంత్రి వ్యాఖ్యానించారు. క్వోమ్‌ సిటీలో కొంతమంది దుండగులు స్కూలు బాలికలపై విషప్రయోగానికి పాల్పడుతున్నారని చెప్పారు. ఇదంతా బాలికల పాఠశాలలను మూసివేసి, వారిని విద్యకు దూరం చేసేందుకే’ అని వెల్లడిరచారు. గతేడాది నవంబర్‌ నుంచి ఇలాంటి కేసులు వందలాదిగా నమోదయ్యాయని, బాధిత బాలికలలో కొంతమంది ఆసుపత్రి పాలయ్యారని మంత్రి పనాహీ చెప్పారు. క్వోమ్‌ సిటీలోని స్కూళ్లలో ఇలా విషప్రయోగం జరుగుతోందని చెప్పారు.దీనివల్ల బాధితులు శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరించారు. ఇది చాలా సున్నితమైన అంశమని, జాగ్రత్తగా డీల్‌ చేస్తున్నామని చెప్పారు. అయితే, ఈ కేసులకు సంబంధించి ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని మంత్రి స్పష్టం చేశారు. విషప్రయోగానికి పాల్పడే వారిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img