Friday, April 26, 2024
Friday, April 26, 2024

చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం : జిన్‌పింగ్‌

బీజింగ్‌: సంప్రదింపులు, సహకారంతో సమస్యలు పరిష్కరించుకోవాలని న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 76వ సమావేశాలను ఉద్దేశిస్తూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ వీడియో లింక్‌లో ప్రసంగించారు. అమెరికాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపధ్యంలో ఘర్షణాత్మక వాతావరణం మంచిదికాదని ప్రపంచ దేశాధినేతలను ఉద్ధేశించారు. మెరుగైన ప్రపంచ నిర్మాణానికి శాంతి, అభివృద్ధి, సమానత్వం, న్యాయం, ప్రజాస్వామ్యం, స్వాతంత్య్రం వంటి అంశాలపై ప్రపంచం దృష్టి పెట్టాలన్నారు. సమానత్వం, పరస్పర గౌరవం ఉంటే రెండు దేశాల మధ్య విభేదాలు ఉండవన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌`19 ఇంకా కొనసాగుతోంది. నూతన కేసుల సంఖ్య పెరుగుతోంది. మానవాళి భవిష్యత్తుకు ఈ మహమ్మారిపై నిర్ణయాత్మక పోరాటం చేసి గెలవాలన్నారు. మానవత్వంతో తప్పకుండా విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఏడాది చివరినాటికి రెండు బిలియన్‌ డోసుల టీకాలను ప్రపంచానికి అందిస్తామని తెలిపారు. స్థిరమైన అంతర్జాతీయ వ్యవస్థ నిర్మాణానికి యుఎన్‌ కట్టుబడిఉండాలన్నార. అఫ్గాన్‌ను తాలిబన్లు ఆక్రమించడంపై ఆయన ప్రస్తావిస్తూ బయట దేశాల సైనిక చర్యతో నష్టమే ఉంటుందన్నారు. చైనా ఎప్పుడూ ఏ దేశ ఆక్రమణకు వెళ్లలేదని ఎవరిపైనా అధిపత్యాన్ని చెలాయించదని జిన్‌పింగ్‌ తెలిపారు. చైనా ప్రజలు ఎప్పుడూ శాంతి, సామరస్యాన్ని కోరుకుంటారని జిన్‌పింగ్‌ తెలిపారు. ప్రపంచ శాంతికోసం చైనా కట్టుబడి వుంటుందన్నారు. ప్రజాస్వామ్యం అనేది ఒక ప్రత్యేకదేశానికి సంబంధించిన హక్కు కాదు. అన్ని దేశాల ప్రజలు ఆనందించే హక్కు అని చైనా అధ్యక్షుడు నొక్కి చెప్పారు. ఒక దేశ విజయం మరొక దేశ వైఫల్యంకాదన్నారు. ప్రపంచం అన్ని దేశాల ఉమ్మడి అభివృద్ధి, పురోగతికి సరిపోయేంత పెద్దదిగా ప్రస్తుతించారు. దేశాల మధ్య విభేదాలు, సమస్యలు సంభాషణల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.
ఐక్యరాజ్యసమితి 76వ సర్వసభ్య సమావేశాలు ప్రారంభమయ్యాయి. సెక్రటరీ జనరల్‌ గుటెర్రస్‌ ప్రసంగంతో సమావేశాలు ఆరంభమయ్యాయి. వారంరోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగుతాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ప్రపంచాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచంలో నెలకొన్న పరిస్తితుల గురించి ప్రస్తావించారు.
భారత ప్రధాని మోదీ శనివారం ఈ సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించవలసి ఉంది. అఫ్గానిస్థాన్‌కు కూడా ఆహ్వానం అందింది. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన తాలిబన్లకు కూడా ఆహ్వానం అందింది. సర్వసభ్య సమావేశంలో ప్రసగించవసిందిగా సూచించింది. ఈ మేరకు తాలిబన్లు ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. 26,27 తేదీలో తాలిబన్‌ అంబాసిడర్‌ ప్రసంగిస్తారు. ఖతర్‌కు చెందిన తమ అధికార ప్రతినిధి సుహైల్‌ షహీన్‌ను అంబాసిడర్‌గా ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img