Friday, April 26, 2024
Friday, April 26, 2024

తొందరపాటు నిర్ణయం

కోవిడ్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ముగింపుపై నిపుణులు

న్యూయార్క్‌: కరోనా మహమ్మారి ఇకపై ప్రపంచ విపత్తు కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. మూడేళ్ల కిందట ప్రకటించిన గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీని ముగిస్తున్నట్లు వెల్లడిరచింది. ‘కోవిడ్‌`19 ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితి కాదని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ ఘెబ్రేయేసస్‌ పేర్కొన్నారు. ‘ఎమర్జెన్సీ తొలగించడం అంటే కోవిడ్‌ ముగిసిందని కాదు. ప్రతి మూడు నిమిషాలకు ఒకరు కోవిడ్‌ వల్ల చనిపోతున్నారు. కొత్త వేరియంట్లు వస్తుంటాయి. పాండమిక్‌ దశ కొనసాగుతుంది. కాబట్టి సహజీవనం తప్పదు. అప్రమత్తంగా ఉండాల్సిందే’ అని ఆయనన్నారు. కోవిడ్‌ మళ్లీ ప్రపంచాన్ని పీడిస్తుందా అన్నదానిపై సమీక్ష జరపాల్సి ఉన్నట్లు టెడ్రోస్‌ తెలిపారు. అయితే డబ్ల్యూహెచ్‌ఓ తీసుకున్న తాజా నిర్ణయాన్ని ఆరోగ్య నిపుణులు అందరూ స్వాగతించలేదు. ఇది తొందరపాటు నిర్ణయం అని అంటున్నారు. ఎమర్జెన్సీని కొనసాగిస్తే బాగుండేదని, అనేక దేశాల్లో ముప్పు ఎక్కువగానే ఉన్నదని అభిప్రాయపడ్డారు. కోవిడ్‌ ప్రతిస్పందన బృందంలో పనిచేసిన బ్రెజిల్‌ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ మెడిసిన్‌ సభ్యులు, శ్వాస సంబంధిత వైద్యులు డాక్టర్‌ మార్గరెట్‌ డాల్కోమో కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. డబ్ల్యూహెచ్‌ఓ హెల్త్‌ ఎమర్జెన్సీని ముగించేందుకు తొందరపడిరదని అన్నారు. చైనా నిపుణులు కూడా డబ్ల్యూహెచ్‌ఓ నిర్ణయాన్ని పూర్తి మద్దతివ్వలేదు. తమ దేశంలో ఆంక్షలు, పర్యవేక్షణ కొనసాగుతాయని తెలిపారు. కోవిడ్‌ కనుమరుగు కాలేదని, దాని ప్రభావాన్ని నియంత్రించే స్థితిలో ఉన్నామని చైనా కోవిడ్‌ ప్రతిస్పందన నిపుణుల కమిటీ హెడ్‌ లియాంగ్‌ వన్నైన్‌ శనివారం అన్నారు. వైరస్‌ మ్యుటేషన్లు, వాక్సినేషన్లు, కోవిడ్‌ చికిత్స సామర్థ్యాల్లో మెరుగుదల వంటివి కొనసాగుతాయని లియాంగ్‌ చెప్పారు. కోవిడ్‌పై జీరో టాలరెన్స్‌కు కోవిడ్‌ కట్టుబడి ఉన్నట్లు ఆ దేశాధికారులు వెల్లడిరచారు. కాగా, కోవిడ్‌తో సహజీవనం తప్పదని, టీకాలు తీసుకోవడం, మాస్కులు ధరించడం తదితర జాగ్రత్తలు అనివార్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిరచింది. వచ్చే రెండేళ్ల కోసం కోవిడ్‌ ప్రణాళికను కూడా డబ్ల్యూహెచ్‌ఓ ఇటీవల జారీ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img