Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

స్పానిష్‌ కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ

ఉపప్రధాని కార్మన్‌ సహా సీనియర్ల రాజీనామాలు
మాడ్రిడ్‌ : తమ ప్రభుత్వానికి నూతనోత్సాహం నింపేందుకు కేబినెట్‌లో భారీ మార్పులకు స్పానిష్‌ ప్రధాని పెడ్రో శాంచెజ్‌ పూనుకున్నారు. పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉప ప్రధాని కార్మెన్‌ కాల్వో కేబినెట్‌కు రాజీనామా చేశారు. రెండవ ఉప ప్రధాని, ఆర్థిక వ్యవహారాల మంత్రి నాడియా కాల్వినోకు పదోన్నతి కలిగింది. రాజీనామాలు చేసిన వారిలో ఆరాంచ గోంజాల్వెజ్‌ లయా (విదేశీ వ్యవహారాల మంత్రి), ఇసాబెల్‌ సెలా (విద్య మంత్రి), జువాన్‌ కార్లోస్‌ కాంపో (న్యాయమంత్రి), జోసె మాన్యుయెల్‌ రోడ్రిగ్జ్‌ (సాంస్కృతిక శాఖ మంత్రి), పెడ్రో డుకె (సైన్స్‌, ఇన్నోవేషన్‌)Ñ జోసె లుయిస్‌ అలాబోస్‌ (రవాణా మంత్రి) ఉన్నారు. కాగా, విదేశీ వ్యవహారాల శాఖ నూతన మంత్రిగా జోసె మానుయేల్‌ అల్బరేస్‌Ñ విద్యా మంత్రిగా పిలర్‌ అల్జేరియా, న్యాయ మంత్రిగా పిలర్‌ లాల్ప్‌, సాంస్కృతిక శాఖ మంత్రిగా మైఖెల్‌ ఇసెటా, సైన్స్‌, ఇన్నోవేషన్‌ మంత్రిగా డయానా మొరంట్‌Ñ రవాణా మంత్రిగా రాకెల్‌ సాంచెజ్‌ నియమితులయ్యారు. ‘ప్రజాతీర్పుకు 30 నెలలు మాత్రమే మిగిలివున్నాయి. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు బృందం ఏర్పాటుపై దృష్టి పెట్టాలి. ప్రభుత్వ రంగంలో అనుభవం కలిగివున్న యువకులను మంత్రిమండలిలో తీసుకు రావాలని భావించాను’ అని టీవీ సందేశంలో ప్రధాని తెలిపారు. తాజా మార్పులతో కేబినెట్‌ కనిష్ట సగటు వయస్సు 55 నుంచి 50 ఏళ్లకు తగ్గిందని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img