Friday, April 26, 2024
Friday, April 26, 2024

చైనాకు కోస్టారికా కమ్యూనిస్టుల మద్దతు

శాన్‌ జోస్‌: తైవాన్‌లో నాన్సీ పెలోసి పర్యటనను ఖండిస్తూ కోస్టారికాలోని పీపుల్స్‌ వాన్‌గార్డ్‌ పార్టీ (పివిపి) తీవ్రంగా ఖండిరచింది. చైనా ఒక్కటే, ప్రత్యేకమైనది, అవిభాజ్యమైనదిగా పేర్కొన్నారు. చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ, అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ఉద్దేశించి కోస్టారికా సీపీ ప్రధాన కార్యదర్శి హంబర్టో వర్గాస్‌ రాసిన లేఖలో చైనా ప్రజలకు తన గౌరవాన్ని, అభినందనలు తెలిపారు. నాటో,అమెరికా దేశాల సామ్రాజ్యవాద చట్రంలో ప్రపంచంలోని ప్రజల ప్రామాణికత, ప్రాదేశిక సార్వభౌమాధికార సమగ్రతకు వ్యతిరేకంగా చేపట్టిన చర్యలను తీవ్రంగాఖండిరచింది. ‘‘చైనా ఒకటి, ప్రత్యేకమైనది.. విడదీయరానిదని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ తమ సరిహద్దులు, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలలో విశ్వవ్యాప్త గౌరవాన్ని చట్టబద్ధంగా కోరుకుంటారని పేర్కొంది. సామ్రాజ్యవాద ఆధిపత్యంలోని ఏకధృవ ప్రపంచ విధానాలను అధిగమించాలని సూచించింది.శాంతి, సార్వత్రిక సౌభ్రాతృత్వ ప్రపంచానికి దారితీసే కొత్త మార్గాలకు కోస్టారికన్‌ కమ్యూనిస్టులు అభిప్రాయపడుతున్నారని పేర్కొంది. చైనా లక్ష్యాలతో మీరు విజయం సాధించాలని మేము కోరుకుంటున్నాము. చైనా ప్రజలందరూ అదే విధంగా ఉండాలని కోరుకుంటున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img