ఖార్టోమ్ : ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్టు, వర్కర్స్ పార్టీలు సూడాన్‌లో సైనికతిరుగుబాటును ఖండిరచాయి. ఈ నేపధ్యంలో కమ్యూనిస్టులు ఆఫ్రికన్ దేశ ప్రజలకు తమ సంఫీుభావాన్ని ప్రకటించాయి. సూడాన్‌లో తిరుగుబాటు విఫలమవుతుంది..సూడాన్ ప్రజలు విజయం సాధిస్తారని 35దేశాల కమ్యూనిస్టులు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. సూడాన్‌లో సహజ వనరుల దోపిడీకి, ఈ ప్రాంతంలో ఆధిపత్యంకోసం సామ్రాజ్యవాదుల జోక్యానికి వ్యతిరేకంగా సూడాన్ ప్రజలు స్వేచ్ఛ, సామాజిక పురోగతి కోసం చేస్తున్న నిరంతర పోరాటానికి వందనం చేస్తున్నట్లు ప్రకటించాయి. 2018 డిసెంబరు నుండి తమ దేశాన్ని నియంతృత్వం, నిరంకుశత్వం నుండి విముక్తి చేయడానికి వీరోచిత పోరాటాన్ని ప్రారంభించిన కమ్యూనిస్టులు, సూడాన్ ప్రజలకు పూర్తి సంఫీుభావాన్ని ప్రకటించాయి. సూడాన్ ప్రజలు గెలుస్తారు. సైనిక తిరుగుబాటు విఫలమవుతుందని సంయుక్త ప్రకటన విడుదల చేశారు.