Monday, September 26, 2022
Monday, September 26, 2022

శ్రీ చైతన్య లో ఘనంగా 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

విశాలాంధ్ర -రాజంపేట: రాజంపేట పట్టణ కేంద్రంలోని ఆర్ఎస్ రోడ్డులో ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాలలో సోమవారం ప్రిన్సిపాల్ ఆకేపాటి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం దేశభక్తి గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం కృషి చేసిన మహనీయులను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు ముందుకు సాగలన్నారు. ప్రతి విద్యార్థి బాగా చదివి ఉన్నతమైన స్థాయికి ఎదగాలన్నారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ అనూష, డీన్ వెంకటసుబ్బయ్య, సి బ్యాచ్ ఇంచార్జ్ శ్రీనివాసులు, ప్రైమరీ ఇంచార్జ్ కస్తూరి, ఉపాధ్యాయులు చందన, వెంకటేష్, రూప, శ్వేత, రమణ, వ్యాయామ ఉపాధ్యాయులు చంద్ర, శాబు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img