Monday, May 6, 2024
Monday, May 6, 2024

పేద బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పనిచేస్తున్న జెండా ఎర్ర జెండా

గూడూరులో ఘనంగా 98 వ వ్యవస్థాపక దినోత్సవం
విశాలాంధ్ర-గూడూరు :
భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)98వ వ్యవస్థాపక దినోత్సవం పెడన నియోజకవర్గం గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. పేరిశెట్టి విజయ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో గూడూరు మండలం కార్యదర్శి యక్కల. పీతాంబరధరరావు, కప్పలదొడ్డి కార్యదర్శి నున్న. హేమ సుబ్రహ్మణ్యం లతో కలిసి పార్టీ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా సీనియర్‌ కామ్రేడ్‌ బళ్ల. మల్లికార్జునరావు మాట్లాడుతూ, ఎర్ర జెండాకు ఘనమైన చరిత్ర ఉందని అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించి ప్రజా సమస్యలు పరిష్కారం చేసిన ఘనత ఎర్ర జెండాకు దక్కిందని, ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పనిచేస్తున్న జెండా ఎర్ర జెండా అన్నారు. ఈ కార్యక్రమంలో బట్ట. కోట సుబ్రహ్మణ్యం, ఊటుకూరి. చిన్నమయ్య లింగం, మెడక.మోక్షనందరరావు, నున్న. మేఘనాధరావు, కుర్మా. వెంకటేశ్వరరావు, ఈశ్వరరావు, శంకర్రావు, నగుబోత రావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img