Monday, May 6, 2024
Monday, May 6, 2024

కవి యాత్ర

కవి నిరంతర యాత్రికుడు
ఎక్కడ అవినీతి కళ్లు తెరుస్తుందో
అక్కడికి అక్షరాయుధంతో
కవితా రథాన్ని నడిపిస్తాడు.
అతనిది అంతరాయ మెరుగని
సుదీర్ఘ జీవన యాత్ర
ఎన్నెన్నో కవితా ఖండికలు
పురుడు పోసుకుంటాయి.
కొన్ని రత్న కిరీటాలై మెరుస్తాయి
జాతి రుగ్మతల్ని పసిగట్టి
రుగ్మతా రాహిత్యం కోసం
అడుగుల్లో చైతన్యం నింపుకొని
విక్రమార్కుడై విహరిస్తాడు
రోజు రోజుకీ
దిగజారుతున్న విలువలు
జాతిని అవహేళన చేస్తాయి
స్వార్థం విశ్వరూపమెత్తి
రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తుంది
హద్దులుదాటుతున్న వాతావరణం
కలానికి కలవరం అవుతుంది
హలమై, సమాజాన్ని దున్ని
మానవత్వపు మొక్కల్ని నాటే
ప్రయత్నంలో నిమగ్నమౌతుంది
వాటి వేరులు ఎరుపెక్కి
అవినీతి కలుపును
కాల్చేందుకు సిద్ధపడుతుంది.
ఒకరోజు ఆలశ్యమైనా,
నీతిపరిమళంజాతంతా వ్యాపించి
యువతలో జాతీయతత్వం
విధిగా అలవరుస్తుంది
చైతన్యం రగిలించి
నవ సమాజ సృష్టికి
మార్గమౌతుంది
`ఎస్‌.ఆర్‌.పృథ్వి,
సెల్‌: 9989223245

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img