Friday, April 26, 2024
Friday, April 26, 2024

11 మంది మహిళా సైన్యాధికారులకు శాశ్వత కమిషన్‌ : కేంద్రం

న్యూదిల్లీ : పదకొండు మంది మహిళా సైన్యాధికారులకు శాశ్వత కమిషన్‌ ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టుకు కేంద్రం హామీ ఇచ్చింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించినందుకు సైన్యంపై చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు హెచ్చరించిన నేపథ్యంలో ఈ మేరకు కేంద్రం తెలిపింది. 10 రోజుల్లోగా త్వరితగతిన చర్యలు చేపడతామని పేర్కొంది. నవంబర్‌ 1లోగా మహిళా అధికారులకు కమిషన్‌ ఏర్పాటు చేయాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను సైన్యం అమలు చేయలేదు. దీంతో ఆర్మీపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించిన నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు తెలిపింది. 39 మంది మహిళా సైన్యాధికారులకు నవంబర్‌ 1 నాటికి శాశ్వత కమిషన్‌ ఏర్పాటు చేయాలని సుప్రీం గతంలో తీర్పునిచ్చింది. శాశ్వత కమిషన్‌కు తాము అనర్హులంటూ ఆర్మీ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ 72 మంది మహిళా అధికారులు ఆగస్టులో కోర్టును ఆశ్రయించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img