Monday, May 6, 2024
Monday, May 6, 2024

పంజాబ్‌లో ‘ఇంటింటికీ రేషన్‌’ : మాన్‌

చండీగఢ్‌: పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ సోమవారం ఇంటింటికీ రేషన్‌ పంపిణీ చేసే పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. నాణ్యమైన సరుకులు లబ్ధిదారులకు వారి ఇంటి వద్దనే పంపిణీ చేయబడతాయని, ఇకపై క్యూలలో నిలబడాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే ఈ పథకం అర్హులైన లబ్ధిదారులకు ఐచ్ఛికం అని మాన్‌ ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఈ పథకం వివరాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయని స్పష్టం చేశారు. ‘మా అధికారులు లబ్ధిదారులకు ఫోన్‌ కాల్‌ చేస్తారు. వారి సౌలభ్యం, అందుబాటులో ఉండటాన్ని బట్టి వారి ఇళ్లకు రేషన్‌ పంపిణీ చేయబడుతుంది’ అని మాన్‌ పేర్కొన్నారు. ఈ పథకం ఐచ్ఛికమని, రేషన్‌ డిపో మీ ఇంటికి చాలా దగ్గరలో ఉంటే అక్కడి నుంచే రేషన్‌ తెచ్చుకోవచ్చునని పంజాబ్‌ ముఖ్యమంత్రి అన్నారు. ‘అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం దిల్లీలో కూడా ఈ పథకాన్ని ప్రారంభించినప్పటికీ దురదృష్టవశాత్తు అది ఆగిపోయింది. కానీ పంజాబ్‌లో మేము ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయబోతున్నాము’ అని మాన్‌ చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పేదలు, సామాన్యులు తమ రేషన్‌ కోసం రేషన్‌ డిపోల వెలుపల పెద్ద పెద్ద క్యూలలో నిలబడాల్సి రావడం బాధాకరమని మాన్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img