Friday, April 26, 2024
Friday, April 26, 2024

క్రీడా ప్రతిభా పురస్కారాలు 2022

విశాలాంధ్ర బ్యూరో నెల్లూరు:2011 నుండి సింహపురి స్పోర్ట్స్ ఫౌండేషన్ ద్వారా నిర్విరామంగా నిర్వహించబడుతున్న క్రీడా ప్రతిభా పురస్కారాలను ఈ సం|| కూడా హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినం పురస్కరించుకుని జిల్లాలో ప్రతిభ క్రీడాకారులకు క్రీడా ప్రతిభా పురస్కారాలను ఈ నెల 29వ తేది స్థానిక ACSR స్టేడియం నందు బహుకరించడం జరుగుతున్నదని రోషన్ ఇండోర్ స్టేడియం నందు శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సింహపురి స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ముక్కాల ద్వారకనాథ్ తెలిపారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ కోటా లోకి పరిగణనలోకి తీసుకున్న 34 క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్న, పతకాలు సాధించిన క్రీడాకారులు అర్హులు. సౌత్ జోన్ యూనివర్సిటీ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులు కూడా అర్హులే.
ప్రతిఒక్క క్రీడాకారుడు తప్పనిసరిగా అప్లికేషన్ తో పాటు అత్యున్నత స్థాయి సర్టిఫికేట్ తో పాటు దానికి సంభందించిన క్రిందిస్తాయిలో పాల్గొన్న సర్టిఫికేట్ లను విధిగా జత పరచవలెను.
ఎంపిక కాబడిన క్రీడాకారులకు షీల్డ్, నగదు, సర్టిఫికేట్ లతో తమతో పాటు తమకు శిక్షణ ఇచ్చిన గురువులను సత్కరించబడును.గత రెండు సం|| లు కోవిద్ కారణముగా క్రీడలను నిర్వహించిన కారణముగా రాష్ట్రస్థాయి లో ప్రథమ బహుమతి గెలుపొందిన క్రీడా జట్టుకు ప్రత్యేక బహుమానం తో సత్కరించడం జరుగుతుంది.ఆగష్టు 1, 2021 నుండి జూలై 31 2022 మధ్య పోటీలలో పాల్గొన్న, గెలుపొందిన క్రీడాకారులు అర్హులు.అప్లికేషన్స్ రేపటి నుండి ACSR స్టేడియం నందు అందుబాటులో ఉంటాయి. ఉత్సాహవంతమైన క్రీడాకారులు తమ అప్లికేషన్స్ ను ఈ నెల 25వ తేది సాయంత్రం 5గం|| లోగా ACSR స్టేడియం నందు అందజేయగలరు. మరిన్ని వివరాలకు 92467 77777 నందు సంప్రదింగలరు.క్రీడల్లో విశిష్ట ప్రతిభ కల్గిన క్రీడాకారుడు నికి క్రీడా రత్న ఉత్తమ శిక్షణ ఇచ్చిన గురువుకు క్రీడా గురు అనే రెండు ప్రత్యేక అవార్డులను ఇవ్వడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి నిమ్మల వీర వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి మద్దిపాతి ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img