Friday, April 26, 2024
Friday, April 26, 2024

తీరు మారని పోలీసు వ్యవస్థ

తిప్పినేని రామదాసప్ప నాయుడు
ఇటీవల మూడు నెలల కిందట ఒకకేసు విషయంలో తీర్పు చెబుతూ… సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పోలీస్‌ వ్యవస్థలో సంస్కరణలు రావాలని, ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ పాలకుల సలహాల మేరకు పాత కేసులు తిరగదోడి, మరికొన్ని కొత్త కేసులు, కుట్ర కేసులు జోడిరచి ప్రతిపక్షాల నాయకులను ఆ పార్టీల కార్యకర్తలను ఇబ్బందు లకు గురి చేయడం పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే అంతకు నెల రోజుల ముందు చెన్నై హైకోర్టు పోలీసు డిపార్ట్‌మెంట్‌లో 80 శాతం అవినీతిపరులు వున్నారని సంచలన తీర్పు వెలువరించింది. ఆరోపణ లకు మరింత బలం చేకూరుస్తూ ఇటీవల హైదరాబాద్‌ నగరంలో సర్కిల్‌ ఇన్‌ స్పెక్టరు కె.నాగేశ్వరరావు మీద రేప్‌, కిడ్నాప్‌ కేసు నమోదు అయింది. కీచక ప్రబుద్దుణ్ణి వనస్థలిపురం పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపించారు. ఏదో రకమైన అవినీతి ఆరోపణలు పోలీసుల పైన ఈ మధ్యకాలంలో తరచూ వెలుగు చూస్తున్నాయి. రెండేండ్ల కిందట మల్కాజ్‌గిరి ఏసీపీ నర్సింహ్మారెడ్డి వందకోట్ల అక్రమ ఆస్తులతో, ఎల్బీనగర్‌ ఏసీపీ జయరాంరెడ్డి ముప్ఫై కోట్ల అక్రమ ఆస్తులతో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. నెల కిందట బంజారా హిల్స్‌ సీఐ శివచంద్ర ఓ పబ్‌ నిర్వాహకుల దగ్గర రెగ్యులర్‌గా మామూళ్లు తీసుకుంటూ ఆ పబ్‌ చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నాడని హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమీషనర్‌ సి.వి.ఆనంద్‌ సస్పెండ్‌ చేశారు. ఇదే విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకచోట ఓ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ గిరిజన యువకుడ్ని థర్డ్‌ డిగ్రీతో చిత్రహింసలు పెట్టాడనీ… జైభీమ్‌ సినిమా తరహాలో అతిగా వ్యవహరించాడని ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. దక్షిణ తెలంగాణ వనపర్తి ప్రాంతంలో ఒక సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఓ వివాహిత మహిళతో అనైతికంగా వ్యవహరిస్తున్న విషయాన్ని పసిగట్టి స్వయంగా ఆమె భర్త రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకొని ప్రజల మధ్యకు ఈడ్చుకురాగా.. ప్రజలు బడితపూజ చేశారు. మూడు సంవత్సరాల కిందట హైదరాబాద్‌ నగరం ఎస్‌.ఆర్‌.నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉత్తర తెలంగాణకు చెందిన ఓ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఓ గృహిణితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న వైనాన్ని చుట్టుపక్కల ప్రజలు తెలుసుకొని బజారుకీడ్చారు. చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 2021 నవంబరులో స్థానిక పోలీస్‌ అధికారుల సహాయ సహకారాలతో ఇంటి యజమాని లేని సమయంలో బాగ్‌లింగంపలిలో ఓ ఫ్లాట్‌లోకి స్థానిక రౌడీలు అర్ధరాత్రిపూట తాళాలు పగులగొట్టి అక్రమంగా లోపలికి ప్రవేశించి లక్షలాది రూపాయల నగదును, విలువైన డాక్యుమెంట్లను దొంగిలించడమే కాకుండా ఆ ఇంటిలోనే కాపురం పెట్టారు. పోలీసుల సహాయ సహకారాలు వుండ డంతో ఫ్లాట్‌ యజమాని ఇచ్చిన ఫిర్యాదులోని ఆరోపణలకు అనుగుణంగా కాకుండా సాదాసీదా ట్రెస్‌పాస్‌ సెక్షన్లతో కేసు రిజిష్టర్‌ చేశారు. అంటే… అక్ర మంగా ఆ ఇంట్లోకి ప్రవేశించారు అని మాత్రమే ఎఫ్‌.ఐ.ఆర్‌.లో పొందుపరి చారు. వారిని ఖాళీ చేయించాలంటే… సివిల్‌ కోర్ట్‌ నుంచి అనుమతి తెచ్చు కోండి అని చేతులు దులుపుకున్నారు. 2021 అక్టోబర్‌ చివరిలో నల్లకుంట, కాచిగూడ పోలీసులు ఓ బలమైన ఆర్థిక సంస్థ కార్యాలయంలోకి కోర్టు నుంచి తెచ్చిన ఓ చిన్న సెర్చ్‌ వారెంట్‌తో ప్రవేశించి విలువైన కోట్లాది రూపాయల బాండ్లను, ఇతర డాక్యుమెంట్లను తీసుకొని కార్యాలయాలను రాజకీయ ప్రముఖుల సలహాల మేరకు సీజ్‌ చేశారు. పంచనామా రిపోర్ట్‌లో ఈ బాండ్లను, డాక్యుమెంట్లను మాత్రమే చూపించి స్వాధీనం చేసుకున్న కోటి రూపాయలను పొందుపరచలేదు. ఈ విధంగా హైదరాబాద్‌ నగరం, తెలం గాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ మధ్యకాలంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పాలక పక్షాలకు అనుగుణంగా వ్యవహరిసు ్తన్నారని అన్ని వర్గాల ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బ్రిటీష్‌ పాలకులు నాడు భారతీయులు తిరుగుబాటు చేయకుండా వుండ డానికి, స్వాతంత్య్రోద్యమాన్ని అడుగడుగునా అణచివేయడానికి ఆంగ్లేయు లకు అనుగుణంగా కఠినమైన పోలీసు చట్టాన్ని తీసుకొచ్చారు. స్వాతంత్య్రా నంతరం కూడా నాటి బ్రిటీష్‌ పోలీసు బానిస చట్టమే కొనసాగుతున్నందున నేడు పోలీసులు పాలకులకు అనుగుణంగా వ్యవహరిస్తూ వారి స్వప్రయోజనా లకు పాటుపడుతూ రక్షక భటులు అనే పవిత్ర పదాన్ని భక్షక భటులుగా మార్చేశారు. గ్రామీణ ప్రాంతాలలో ఒక సీఐ మంచి ఆదాయమున్న సర్కిల్‌కు బదిలీ కావాలంటే.. స్థానిక ఎమ్మెల్యేకు ఇరవై నుంచి ముప్ఫై లక్షల వరకు ఇచ్చుకోవలసి వుందన్న ఆరోపణలున్నాయి. ఏసీపీ లేదా డీఎస్పీ బదిలీలకు నలభై నుంచి యాభై లక్షల వరకు ఖర్చు పెట్టుకోవలసి వుందని, గ్రేటర్‌ హైదరాబాద్‌లో అయితే… సీఐలు పక్కాగా యాభై లక్షలు, ఏసీపీలు కోటి రూపాయలు ముడుపులు సమర్పించాలని ఆరోపణలున్నాయి. ఈ స్థాయిలో ఖర్చు పెట్టడమే కాకుండా అధికార ప్రజా ప్రతినిధులు ఎలా చెబితే అలా కేసులు రిజిష్టర్‌ చేయాలి. ఈ నేపథ్యంలో బెయిలబుల్‌ కేసులు నాన్‌ బెయిలబుల్‌గా, నాన్‌ బెయిలబుల్‌ కేసులు బెయిలబుల్‌గా మారిపోతున్నాయి. హైదరాబాద్‌తో పాటు బాగా ఆదాయమున్న వరంగల్‌, నల్లబంగారం వున్న కోల్‌బెల్ట్‌ ఏరియాలలో, ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి నగరాలలో పనిచేసే పోలీసు అధికారులకు భలే భలే డిమాండ్‌ వుందనే అభియోగాలు వున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు పాలకులకు పాలేర్లుగా మారారనే ఆరోపణలకు కూడా రోజురోజుకూ బలం చేకూరుతున్నది.

వ్యాస రచయిత ముద్ర అగ్రికల్చర్‌ Ê స్కిల్‌ డెవలప్‌మెంట్‌
మల్టీస్టేట్‌ కో`ఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ ఛైర్మన్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img