Friday, April 26, 2024
Friday, April 26, 2024

తడబడి.. నిలబడి..!

రాణించిన శ్రేయస్‌, ధావన్‌
కట్టుదిట్టంగా కోల్‌కతా బౌలింగ్‌
కేకేఆర్‌ లక్ష్యం 136

షార్జా : ఐపీఎల్‌14 క్రమేణా చర మాంకానికి చేరుకుంటోంది. క్వాలి ఫైయర్‌`2లో భాగంగా బుధవారం దిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఈనెల 15న జరగబోయే ఫైనల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఢీకొడుతుంది. ముందుగా టాస్‌ గెలిచిన కోల్‌కతా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. జట్టులో ఎలాంటి మార్పు చేయలేదు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ క్యాపిటల్స్‌ ఒక్క మార్పు చేసింది. టామ్‌కర్రన్‌ స్థానంలో స్టొయినీస్‌ జట్టులోకి వచ్చాడు. ఇన్నింగ్స్‌ను శిఖర్‌ ధావన్‌, పృథ్వీషా కలిసి ప్రారంభించారు. మొదటి ఓవర్‌లో కేవలం ఒక పరుగు మాత్రమే లభించింది. ఈక్రమంలో ఓపెనర్‌ పృథ్వీషా ఫోర్‌ బాది స్కోరు బోర్డులో కదలిక తెచ్చాడు. అయితే రెండో ఓవర్‌ ఫెర్గుసన్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పెద్దగా పరుగులు లభించలేదు. మూడో ఓవర్‌ మళ్లీ షకీబ్‌ వేయగా, ఈ దఫా పృథ్వీ బ్యాట్‌ రaుళిపించాడు. లాంగాన్‌ మీదుగా స్టేడియం టాప్‌పైకి సిక్స్‌ కొట్టాడు. అదే ఊపులో మరో ఫోర్‌ బాదాడు. మరోవైపు పరుగులు తీసేందుకు ఆలోచిస్తున్న ధావన్‌ ఈ దఫా సునీల్‌ నరైన్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి ఊపులోకి వచ్చాడు. దీంతో నాలుగు ఓవర్లు ముగిసే సమయానికి దిల్లీ వికెట్‌ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. ఈ తరుణంలో ధాటిగా ఆడుతున్న ఓపెనర్‌ పృథ్వీషా (18, 12 బంతులు, 2I4, 1I5) వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో ఎల్‌బీ డబ్ల్యూ రూపంలో పెవిలియన్‌ బాట పట్టాడు. అనంతరం స్టొయినీస్‌ క్రీజులోకి వచ్చాడు. కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తుండటంతో పరుగులు రాబట్టడం కష్టతరంగా మారింది. 7 ఓవర్లు ముగిసే సమయానికి జట్టు స్కోరు 50కి చేరుకుంది. ధావన్‌, స్టొయినీస్‌ కలిసి నిలకడగా ఆడుతున్నారు. అడపా, దడపా సింగిల్స్‌ తీస్తూ స్కోరు బోర్డును పెంచసాగారు. అయితే బ్యాట్స్‌మెన్‌కి పిచ్‌ సహకరించకపోవడంతో పెద్దగా పరుగులు చేయలేకపోయారు. ఈ తరుణంలోనే శివమ్‌ మావి వేసిన ఓ అద్భుతమైన బంతికి స్టొయినీస్‌ (18, 23 బంతులు, 1I4) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌ ఆచితూచి ఆడసాగాడు. అయితే పరుగులు ఆశించినంతగా రాకపోవడంతో సహనం కోల్పోయిన ధావన్‌ (36, 39 బంతులు, 1గ4, 2I6) భారీ షాట్‌ కొట్టడంతో ఆ బంతికి షకీబ్‌ ఒడిసి పట్టుకున్నాడు. దీంతో ధావన్‌ పెవిలియన్‌ బాట పట్టక తప్పలేదు. ఈ దశలో జట్టును ఆదుకుంటాడనుకున్న కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (6) కనీసం కొంచెంసేపైనా క్రీజులో ఉండలేదు. ఫెర్గుసన్‌ బౌలింగ్‌లో త్రిపాఠికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే హెట్మెయిర్‌ చక్రవర్తి బౌలింగ్‌లో భారీ షాట్‌ కొట్టగా అది లాంగాన్‌లో ఫీల్డర్‌ క్యాచ్‌ పట్టగా ఆ బంతి కాస్తా థర్డ్‌అంపైర్‌ నో బాల్‌గా ప్రకటించడంతో హెట్మెయిర్‌కు లైఫ్‌ వచ్చింది. ఇక ఓవర్ల చివర్లో శ్రేయస్‌, హెట్మెయిర్‌లు కలిసి ధాటిగా ఆడసాగారు. ఫెర్గుసన్‌ బౌలింగ్‌లో హెట్మెయిర్‌ వరుసగా రెండు సిక్స్‌ కొట్టాడు. ఈక్రమంలోనే లేని పరుగుకు యత్నించి రనౌట్‌గా వెనుదిరిగాడు. చివర్లో శ్రేయస్‌ మెరుపులు మెరిపించడంతో దిల్లీకి గౌరవప్రదమైన స్కోరు దక్కింది. శ్రేయస్‌, అక్షర్‌లు నాటౌట్‌గా నిలిచారు. నిర్ణీత 20 ఓవర్లలో దిల్లీ క్యాపిటిల్స్‌ 135/5 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తికి రెండు, ఫర్గుసన్‌, శివమ్‌మావిలకు చెరో వికెట్‌ దక్కింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img