Saturday, October 1, 2022
Saturday, October 1, 2022

అరకు పార్లమెంటు టీడీపీ కార్యాలయం ప్రారంభం

విశాలాంధ్ర, పార్వతీపురం/బెలగాం:పార్వతీపురం మన్యం జిల్లాలో టీడీపీ అరకు పార్లమెంటు కేంద్రాన్ని ఎమ్మెల్సీ, మాజీమంత్రి శత్రుచర్ల విజయరామరాజు, టీడీపి పోలిట్ బ్యూరో సభ్యురాలు, జిల్లాపార్టీఅధ్యక్షురాలు గుమ్మడి సంధ్యారాణిలుకలిసి సోమవారంనాడు ప్రారంభం చేశారు. పట్టణంలోని సౌందర్య నారాయణమూర్తి నగర్ లో శత్రుచర్ల విజయరామరాజు అతిధిగృహంవద్ద ఏర్పాటు చేసిన నూతన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వవిధానాలు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న తీరుపై ద్వజమెత్తారు. ఆదివారం టీడీపిజాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ పలాస పర్యటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపై వారు మండిపడ్డారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో అప్పటి ప్రతిపక్షనేత జగన్ పాదయాత్రను ఇప్పుడు వలే అడ్డుకుంటే జరిగేదా అనిప్రశ్నించారు. రాష్ట్ర రాజకీయాలు కోల్డ్స్తో రేజిలో ఉన్నట్లున్నాయని తెలిపారు. ఎక్కడ అభివృద్ధి కనిపించడం లేదన్నారు. ప్రభుత్వ పనితీరుపై ఆన్ని వర్గాలవారు అసంతృప్తితో ఉన్నారని, రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. నూతనంగా ఏర్పడిన మన్యం జిల్లాలో గిరిజనుల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఐటీడీఏను నిర్వీర్యం చేశారన్నారు. గతంలో ఏర్పాటు చేసిన గిరిజన విశ్వవిద్యాలయమే పూర్తి స్థాయిలో అభివృధ్ధి చేయని వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్తగా పార్వతీపురం జిల్లాలో మెడికల్ కాలేజీ ప్రకటన అమలు చేస్తుందా అని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో మన్యం జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ విజయం తథ్యమన్నారు. జిల్లాలో ఎక్కడ టీడీపీ కార్యక్రమాలు జరిపిన నియోజక వర్గ ఇంఛార్జిల పర్యవేక్షణలో జరగాలన్నారు. జిల్లా టీడీపిలో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయని విలేకరులు ప్రస్తావించగా అంతా ఒకే గ్రూపుకు చెందినవారమని, కుటుంబ సభ్యులు మధ్య ఎటువంటి అరమరికలు లేవని, ఉన్నావాటిని పరిష్కరించు కుంటామని తెలిపారు. ఈకార్యక్రమంలో పార్వతీపురం, కురుపాం,పాలకొండ, సాలూరు ఇంఛార్జిలు బొబ్బిలి చిరంజీవులు, తోయక జగదీశ్వరి, నిమ్మక జయకృష్ణ, ఆర్పీభంజదేవ్ తోపాటు గొట్టాపు వెంకటనాయుడు, పొట్నురు వెంకటనాయుడు, వాడాడ రాము, మజ్జి కృష్ణ మోహన్, మజ్జి వెంకటేష్, శనపతి శేఖరపాత్రుడు,దేవకోటి వెంకటనాయుడు, నంగిరెడ్డి మధు, పెంకి వేణుగోపాల్ , కోరాడ నారాయణరావు, గులిపల్లి సుధా,ఎన్.కృష్ణబాబు, కోలా రంజిత్ కుమార్, దొంకాడ రామకృష్ణ, నాలుగు నియోజకవర్గాల్లోని నాయకులు పాల్గొన్నారు.
మాజీఎమ్మెల్సీ జగదీష్ వర్గం గైర్హాజరు:
మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి, జిల్లాలో కీలకనేత ద్వారపురెడ్డి జగదీశ్, అతనిఅనుచరులు ఈసమావేశానికి హాజరుకాలేదు. పార్వతీపురం నియోజక వర్గంలోని నాయకులు ఎక్కువమంది హాజరు కాలేదు.పార్వతీపురం పట్టణంలో ఎక్కడ విన్నా అంతా దీనిపై చర్చించుకోవడం స్పష్టంగా కనిపించింది.జగదీష్ లేకుండా జిల్లా టీడీపి కార్యాలయం ప్రారంభం కావడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీడీపీలో ఉన్న కుటుంబ కలహాలు ఒక్కసారిగా బయట పడిన నేపథ్యంలో ఈపరినామలు ఎటువైపు దారితీస్తాయో వేచిచూడాలి మరి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img