Thursday, September 29, 2022
Thursday, September 29, 2022

ముఖ్యమంత్రికి అసలు మానవత్వం ఉందా?

సీఎం కేసీఆర్‌పై రేవంత్‌ రెడ్డి ఫైర్‌
తెలంగాణవ్యాప్తంగా గురుకులాలు, హాస్టళ్లలో ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనలపై ప్రతిపక్షాలు టీఆర్‌ఎస్‌ సర్కారును టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పీసీసీ ఛీఫ్‌ రేవంత్‌ రెడ్డి ట్విట్టర్‌ వేదికగా సీఎం కేసీఆర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టళ్లలో ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలపై ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని కోట్‌ చేస్తూ… ‘పేద బిడ్డల వసతి గృహాలు నరకానికి ఆనవాళ్లుగా మారాయి. హాస్టళ్లలో చావు డప్పు మోగుతుంటే దేశానికే తెలంగాణ ఆదర్శమని కేసీఆర్‌ డప్పుకొట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారూ..మీకు మానవత్వం ఉందా? ఉంటే చలించడం లేదెందుకు?’ అంటూ రేవంత్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img