Friday, April 26, 2024
Friday, April 26, 2024

ధరణితో భూసమస్యల పరిష్కారానికి చెక్‌ పడినట్లే : మంత్రి హరీశ్‌రావు

ధరణితో భూసమస్యల పరిష్కారానికి చెక్‌ పడినట్లే అని మంత్రి హరీశ్‌ రావు అన్నారు మంగళవారం ధరణి పోర్టల్‌ సమస్యలు, పరిష్కారం తదితర అంశాలపై సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ములుగులోని ఫారెస్ట్‌ కళాశాలలో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, .ధరణి పోర్టల్‌కు సంబంధించి ప్రత్యేక పోర్టల్‌ పెట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. అందులో భాగంగా జిల్లాలోని ములుగు మండలాన్ని పైలెట్‌ ప్రాజెక్ట్‌గా తీసుకున్నామని మంత్రి పేర్కొన్నారు. కోర్టులు కేసులు, కుటుంబ తగాదాలతో కొన్ని భూ సమస్యలు పెండిరగ్‌లో ఉన్నాయన్నారు. ములుగులో సమస్యలు పరిష్కరించి రైతులకు సర్టిఫికెట్లు అందజేస్తాం. ములుగు తర్వాత ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో చేపడుతామని ఆయన స్పష్టం చేశారు. ధరణి ద్వారా అనేక అక్రమాలక చెక్‌ పడిరదని మంత్రి వివరించారు. సీఎ ఎస్‌ సోమేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ..ధరణి పోర్టల్‌లో ఎలాంటి సమస్య లేదు. సాంకేతిక సమస్యలు కొన్ని ఉన్నాయన్నారు. ధరణి ఒక విప్లవాత్మక కార్యక్రమం అని సీఎస్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ ధరణి పోర్టల్‌ స్వయంగా రూపొందించారు. నిజమైన భూ యజమానులకు భూమిపై హక్కు కల్పించాలని, భూమి బదిలీ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలన్నదే ధరణి ఉద్దేశమని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు ధరణి పోర్టల్‌ను ఏడు కోట్ల మంది ఉపయోగించుకున్నారు. భూముల అమ్మకాలు, కొనుగోళ్లు విజయవంతంగా కొనసాగుతున్నాయని సీఎస్‌ వివరించారు. కార్యక్రమంలో సీఎంఓ కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్‌, శేషాద్రి, రాహుల్‌ బొజ్జా, టీఎస్‌ టెక్నికల్‌ సర్వీసెస్‌ చైర్మన్‌ వెంకటేశ్వరరావు, సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, అడిషనల్‌ కలెక్టర్లు ముజమ్మీల్‌ ఖాన్‌, శ్రీనివాస్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img