Friday, April 26, 2024
Friday, April 26, 2024

స్టాఫ్‌ నర్సులకు ఉద్యోగ భద్రత కల్పించాలి : ఏఐటీయూసీ

విశాలాంధ్ర ` మహబూబ్‌నగర్‌ : ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న స్టాఫ్‌ నర్స్‌ లకు ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ మెడికల్‌ కాంట్రాక్టు అండ్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌(ఏఐటీయూసీ) ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పి.సురేష్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి ఔట్సోర్సింగ్‌ స్టాఫ్‌ నర్సులను రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా తొలగింపును నిరసిస్తూ బుధవారం తెలంగాణ మెడికల్‌ కాంట్రాక్టు అండ్‌ ఔట్సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (ఎఐటియుసి) ఆధ్వర్యంలో మహబూబ్‌ నగర్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి స్టాఫ్‌ నర్సులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా జోరుగా ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా పి.సురేష్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా విపత్కర సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న అవుట్సోర్సింగ్‌ స్టాఫ్‌ నర్సులు ను అక్రమంగా దొడ్డిదారిన రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పదహారు వందల నలభై మందిని తొలగించడం దుర్మార్గమని ధ్వజ మెత్తారు.గగన మోటర్లపై పూలు చల్లుతూ, ఊహల పల్లకి మాటల్లో అరచేతిలో స్వర్గం చూపించే తీయ్యటి కబుర్లు చెప్పిన ప్రభుత్వం నేడు స్టాఫ్‌ నర్సుల కడుపు కొట్టే కర్కశ విధానం అనుసరించడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ప్రభుత్వ మానవ దృక్పథంతో తొలగించిన అవుట్సోర్సింగ్‌ స్టాఫ్‌ నర్సు ఉద్యోగులను మొత్తం ఆరోగ్య శాఖలో సర్దుబాటు చేసి తిరిగి ఉద్యోగాలు కల్పించాలని, భవిష్యత్తులో భర్తీ చేసే పోస్టుల్లో వీరికి తగిన వెయిటేజి కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అవుట్సోర్సింగ్‌ స్టాఫ్‌ నర్సులు కీర్తన, పర్వీన్‌ బేగం, సుమలత, అనిత,కవిత, శివలీల, శృతి, ప్రవీణ, గౌతమి, జమున, శిరీష, రజిత, మంజుల, రేవతి, మాధవి, నందిని, సవిత, శరణ్య, రాణి, శివలీల, బాలమ్మ, దేవి, కిరణ్‌, అరుణ్‌ కుమార్‌, జగదీష్‌, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.
స్టాఫ్‌ నర్సులను విధులోకి తీసుకోవాలి : ఎన్‌ఎస్‌యుఐ
విదుల నుండి తొలగించిన స్టాఫ్‌ నర్సులను ప్రభుత్వం తిరిగి తీసుకోవాలని తెలంగాణ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌ బల్మూర్‌ ప్రభుత్వాని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా డిమాండ్లతో కూడిన వినతిపత్రాని అయన టెర్మినేటెడ్‌ స్టాఫ్‌ నర్సులు తెలంగాణ రాష్ట్ర మహిళ కమిషన్‌ చైర్మన్‌ సునీతా లక్ష్మారెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ ఈనెల 5వ తేదిన ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా స్టాఫ్‌ నర్సులను తొలగిస్తూ ఉత్తర్వులను విడుదల చేసి వారిని విధులోకి రాకుండా చేశారని మండిపడ్డారు. కరోనా మహమ్మారి సమయంలో చాలా మంది స్టాఫ్‌ నర్సులు కోవిడ్‌ మాతృ తల్లితో సహా అనారోగ్యంతో బాధపడ్డారని, చివరకు కొంతమంది వారి కుటుంబాలను కోల్పోయారని అవేధన వ్యక్తం చేశారు. వారు కూడా ప్రభుత్వ రంగంపై ఆశతో ఉద్యోగ భద్రత విషయంలో ప్రభుత్వ ఆసుపత్రులకు సేవలను అందించడానికి ప్రైవేట్‌ రంగాన్ని విడిచిపెట్టారని, వారు కోవిడ్‌ -19 సమయంలో అధిక జీతభత్యాలు, సాధారణ జీతాలు, పిఎఫ్‌ కూడా పొందలేదన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img