Friday, April 26, 2024
Friday, April 26, 2024

హైదరాబాద్‌ నగరంలో నకిలీ నోట్ల చలామణి

ఇద్దరు నిందితులు అరెస్ట్‌ చేసిన పోలీసులు
హైదరాబాద్‌ నగరంలో నకిలీ నోట్లు చలామణి చేస్తూ.. దర్జాగా నగరం మొత్తం తిరుగుతున్న ఇద్దరు నిందితులను సౌత్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నకిలీ నోట్లు.. అసలైన నోట్లు దాదాపు ఒకేలా కనిపిస్తాయని పోలీసులు వివరిస్తున్నారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే.. ఏది నకిలీ.. ఏది అసలు.. అనేది తెలుస్తుందని చెబుతున్నారు. కానీ చాలామంది వాటిని పరిశీలించకుండానే తీసుకుంటారని.. ఆ తర్వాత అది నకిలీ నోటు అని తెలిసి లబోదిబోమంటారని హెచ్చరిస్తున్నారు.
సాయిధ్‌, ఇమ్రాన్‌ అనే ఇద్దరు వ్యక్తులు మహారాష్ట్రకు చెందినవారు. ఉపాధి కోసం హైదరాబాద్‌ నగరానికి వచ్చారు. కానీ.. ఈ ఇద్దరు నిందితులు ఈజీ మనీ కోసం.. 500, 200 రూపాయల నకిలీ నోట్లను చలామణి చేస్తున్నారు. అమాయక జనాలకు నకిలీ నోట్లను అంటగట్టి.. అసలు నోట్లను తీసుకుంటున్నారు. వీరి గురించి.. సౌత్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులకు విశ్వసనీయమైన సమాచారం రావడంతో.. మీర్‌ చౌక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఇద్దరు కేటుగాళ్లను అరెస్టు చేశారు.
మహారాష్ట్రకు చెందిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి నుంచి రెండున్నర లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు కోసం.. మీర్‌ చౌక్‌ పోలీసులకు అప్పగించారు. ఇలాంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరైనా తెలియని వారు పెద్దనొట్లు ఇచ్చి చిల్లర అడిగితే.. ఇవ్వొద్దని స్పష్టం చేశారు. ముఖ్యంగా 500, 200 రూపాయల నోట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img