Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

చేనేత కార్మికులకు ప్రభుత్వం అండ

: టీఆర్‌ఎస్‌ నేత ఎల్‌ రమణ
సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నదని టీఆర్‌ఎస్‌ నేత ఎల్‌ రమణ చెప్పారు. నూలు, చేనేత వస్త్రాలపై జీఎస్టీ వేస్తున్న కేంద్ర ప్రభుత్వం నేతన్నల నడ్డి విరుస్తున్నదని అన్నారు. హుజూరాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌తో కలిసి ఎల్‌ రమణ మీడియాతో మాట్లాడారు.ముడి సరికులపై సబ్సిడీ, థ్రిఫ్ట్‌ఫండ్‌, నేతన్నకు బీమాతో రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటున్నదని చెప్పారు. తమ బతుకులు దుర్భరం చేసిన ఈటలకు నేతన్నలు ఓట్లు ఎలా వేస్తారని అన్నారు. ఈటల రాజేందర్‌ తన స్వప్రయోజనాల కోసం రాజీనామా చేశారని మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ విమర్శించారు. ఈటల ఉద్దేశాన్ని ప్రజలు గమనించారని, ఈ నెల 30న తగిన తీర్పునిస్తారని అన్నారు.. పెంచిన ధరలు తగ్గిస్తామని బీజేపీ ప్రభుత్వం, ఈటల హామీ ఇస్తారా అని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img