Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ మరోసారి వాయిదా తీర్మానం

రాష్ట్రంలో పండిన ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని పార్లమెంటులో టీఆర్‌ఎస్‌ పోరాటం చేస్తోంది. లోక్‌సభలో పార్టీ పక్ష నేత నామా నాగేశ్వరరావు ధాన్యం సేకరణపై స్పీకర్‌ ఓం బిర్లాకు వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. రాష్ట్రంలో తమ రైతాంగం ఆరుగాలం కష్టపడి పండిరచిన పంటను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎఫ్‌సీఐ సేకరించడం లేదని, దీంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారని అందులో పేర్కొన్నారు. ఈ అంశంపై లోక్‌సభలో చర్చించాలని కోరారు. దేశంలో ఆహార ధాన్యాల సేకరణపై కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన జాతీయ విధానం అవలంభించాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img