Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ ఎంపీల ఆందోళన..

ధాన్యాన్ని సేకరించాలని డిమాండ్‌
ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. ఇవాళ కూడా ఉభయసభల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు కేంద్రాన్ని నిలదీశారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలు. ధాన్యం సేకరణపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. లోక్‌సభలో స్పీకర్‌ పోడియం వద్ద ఎంపీలు ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. తెలంగాణ రైతులకు కేంద్రం అన్యాయం చేస్తోందన్నారు. రాష్ట్రంలో లక్ష టన్నుల ధాన్యం కుళ్లిపోయే పరిస్థితి వచ్చిందని, ఆ ధాన్యాన్ని తక్షణమే సేకరించాలని రాజ్యసభ ఎంపీ కేశవరావు డిమాండ్‌ చేశారు.కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని కోరారు. యాసంగి ధాన్యం సేకరణలో కేంద్రం వివక్ష చూపుతోందని కేకే అన్నారు.
పార్లమెంట్‌ సమావేశాలను బాయ్‌కాట్‌ చేసిన తర్వాత దిల్లీలోని తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీ కే కేశవరావు మీడియాతో మాట్లాడారు. మోదీది ఫాసిస్ట్‌ ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. ప్రజలను బీజేపీపై తిరుగుబాటు చేసేలా సమాయత్తం చేస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ ఆందోళనలపై కేంద్రం స్పందించడం లేదన్నారు. చట్టసభను బాయ్‌కాట్‌ చేయడం బాధ కలిగించే విషయమే.. కానీ కేంద్రం తీరుకు నిరసనగానే బాయ్‌కాట్‌ చేస్తున్నామని ఎంపీ కేకే స్పష్టం చేశారు. సభను బాయ్‌కాట్‌ చేయాలని ఎవరూ కోరుకోరు అని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img