Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలలో ఏపీ బాలుర జట్టు విజయకేతనం

విశాలాంధ్ర-రాప్తాడు : మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో గత నెల 28 నుండి ఈనెల 1వ తేదీ వరకు జరిగిన జాతీయ సబ్ జూనియర్ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలలో ఏపీ బాలుర జట్టు అప్రతిహత విజయాలు సాధిస్తూ గ్రాండ్ ఫైనల్ పోటీల్లో మధ్యప్రదేశ్ పై12-02 తేడాతో విజయం సాధించి జాతీయస్థాయిలో ప్రథమ స్థానం సాధించిందని ఏపీ సాఫ్టుబాల్ సీఈఓ సి.వెంకటేసులు తెలిపారు. ఆయన మాట్లాడుతూ దేశంలోని 21 రాష్ట్రాలు పాల్గొన్న ఈ టోర్నమెంటులో ఆంధ్రప్రదేశ్ బాలుర జట్టు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిందన్నారు. జాతీయ స్థాయిలో ఏపీ రాష్ట్ర కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పారన్నారు. క్రీడలకు విశేషమైన ప్రాచుర్యం, ప్రోత్సాహం కల్పిస్తున్న ఏపీ ప్రభుత్వం, శాప్, అనంతపురం ఆర్డిటి, జాతీయ సాప్ట్ బాల్ అసోసియేషన్, సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ సహాయ సహకారాలతో ఇంతటి ఘన కీర్తిని సాధించామన్నారు. భవిష్యత్తులో కూడా జాతీయస్థాయిలో ఏపీ ఖ్యాతిని చాటుతామన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సాఫ్టుబాల్ ఇండియా సీఈఓ ప్రవీణ్ అనౌకర్, సెక్రటరీ ఎల్. ఆర్ మౌర్య, ట్రెజరర్ శ్రీకాంత్ తోరాట్, జాయింట్ సెక్రెటరీ తవాల్కర్, రాష్ట్ర కార్యదర్శి సి. ఆఫ్ చేతుల మీదుగా విజేత జట్టుకు మెడల్స్ తోపాటు కప్పును బహూకరించారు. కార్యక్రమంలో జట్టు సభ్యులతో పాటు కోచ్ లు మహేష్ ,సింహాద్రి, సాకే లక్ష్మి, బద్రి ,సురేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img