Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

చెరువుల త్రవ్వకాలకు అనుమతులు ఎలా ఇచ్చారు….

ఏఎంసీ మాజీ చైర్మన్ సాగిరాజు సాంబశివరాజు…

విశాలాంధ్ర /ఉండి: చట్టం ఎవరికి చుట్టం సామాన్యుడికి ఒక న్యాయం పెత్తందారికి ఒక న్యాయమా
నాకు అనుమతులు లేనప్పుడు నా పక్క చెరువులకు ఎలా అనుమతులు ఇచ్చారని అధికారులు తీరుపై ఏఎంసీ మాజీ చైర్మన్ సాగిరాజు సాంబశివరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సాంబశివరాజు మీడియాతో మాట్లాడుతూ,నా పొలం ఆక్వా జోన్లో ఉన్నప్పటికీ పక్క రైతు వాళ్లు రాజకీయ పరంగా చెరువు తవ్వకుండా ఇబ్బందులు పెడితే దానికి మద్దతు తెలిపిన అధికారులు నాకు చెరువు తవ్వుకునేందుకు అనుమతులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టి పేదలకు ఇళ్ల స్థలం ఇచ్చే స్థలానికి ఆనుకొని చెరువులు తవ్వుతున్నా అటువైపు ఒక్క అధికారి కూడా కన్నెత్తి చూడకపోవడం హాస్యాస్పదంగా ఉందని ధ్వజమెత్తారు .పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన పక్కనే ఆక్వా సాగు కి ఏ రకంగా అనుమతులు ఇచ్చారు అంటూ ప్రశ్నించారు. జగనన్న కాలనీకి దూరంగా ఉన్న మా పొలాలకి లేని అనుమతులు జగనన్న కాలనీ చేర్చి ఉన్న స్థలానికి అనుమతులు ఇస్తారా మండిపడ్డారు. 1954లో ప్రభుత్వ ల్యాండ్ సీలింగ్ లో భాగంగా ఎస్ సి, ఎస్ టి లకు ఇచ్చిన భూములను నేటి పాలకులు బలవంతంగా లాక్కొని వాటిని ఇళ్ల స్థలాలుగా ఇవ్వడమే కాకుండా ఆ పక్కనే ఉన్న భూమిని ఆక్వా సాగుకు అనుమతులు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. చెరువులు తవ్వకాలపై ఉండి రెవెన్యూ ఇన్స్పెక్టర్ ని ప్రశ్నించగా ఇటీవల కాలంలో బదిలీ అయిన తహసిల్దార్ కృష్ణ జ్యోతి అనుమతి ఇచ్చినట్లు తెలిపారన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చెరువు తవ్వకాల్ని నిలిపివేయాలని లేనిపక్షంలో ఉన్నతాధికారులు దృష్టికి వెళ్లడమే కాకుండా కోర్టుని ఆశ్రయిస్తానని సాంబరాజు హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img