Monday, May 6, 2024
Monday, May 6, 2024

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ క్లీన్‌ స్వీప్‌


తెలంగాణలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో తెరాస జయకేతనం ఎగురవేసింది. 12 స్థానాలకు గాను 6 ఏకగ్రీవం కాగా మరో ఆరు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా ఆరుస్థానాల్లోనూ తెరాస అభ్యర్థులు విజయం సాధించారు.ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో భానుప్రసాద్‌ రావుకు 584 ఓట్లు రాగా, ఎల్‌ రమణకు 479 ఓట్లు వచ్చాయి. మొత్తం 1320 ఓట్లు పోల్‌ కాగా, 1303 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. 17 ఓట్లు చెల్లుబాటు కాలేదు.ఉమ్మడి మెదక్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి యాదవరెడ్డికి 762 ఓట్ల వచ్చాయి. సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌ అభ్యర్థికి 238 ఓట్లే పోలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థికి కేవలం ఆరు ఓట్లే వచ్చాయి. మెదక్‌ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 12 ఓట్లు చెల్లనివిగా తేలాయి.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 1271 ఓట్లకుగానూ 1233 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 50 ఓట్లు చెల్లనివని అధికారులు తేల్చారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎం కోటిరెడ్డికి ఏకంగా 917 ఓట్లు వచ్చాయి. ఆయనపై పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి నగేష్‌కు 226 ఓట్లు వచ్చాయి. మొత్తం 691 ఓట్ల మెజార్టీతో కోటిరెడ్డి విజయం సాధించారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తాతా మధు గెలుపొందారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 480 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థికి 242 ఓట్లు వచ్చాయి. తన సమీప ప్రత్యర్థిపై తాతా మధు 238 ఓట్ల మెజార్టీతో మధు గెలుపాందారు. ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో 12 చెల్లని ఓట్లు ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థికి కేవలం 4 ఓట్లే వచ్చాయి.ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఘన విజయం సాధించారు. ఇక్కడ మొత్తం 862 ఓట్లు పోలవగా.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దండె విఠల్‌కు మొత్తం 740 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి, స్వతంత్ర అభ్యర్థి పుష్కరానికి కేవలం 74 ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం 666 ఓట్ల మెజార్టీతో విఠల్‌ విజయం సాధించారు. ఆదిలాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం చెల్లని ఓట్లు 48 నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img