Sunday, July 20, 2025
Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్టణం శివార్లలో ఘోర అగ్నిప్రమాదం

విశాఖపట్టణం శివార్లలో ఘోర అగ్నిప్రమాదం

ఐటీసీ గోదాంలో విషాదం..
గండిగుండం సమీపంలోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఐటీసీకి చెందిన ఫుడ్ ప్రొడక్ట్స్ గోదాంలో శుక్రవారం అర్ధరాత్రి భారీగా మంటలు చెలరేగాయి. మంటల తీవ్రత అంతలా ఉండడంతో గోదాంలోని ఇనుప గడ్డర్లు కూడా వేడికి మేలిపోయి కూలిపోయాయి. ఈ ప్రమాదానికి కారణంగా విశాఖపట్నం, విజయనగరం జిల్లాల నుంచి డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్‌లు, ఎన్డీఆర్ఎఫ్ (చీణRఖీ) సిబ్బంది వెంటనే స్పందించి రంగంలోకి దిగారు.
ఘటనాస్థలానికి తొమ్మిది ఫైర్ ఇంజన్లు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే గోదాంలో ఫుడ్‌ ఉత్పత్తులతో పాటు సిగరెట్లు, సెంట్ బాటిల్స్, పినాయిల్ వంటి దాహక పదార్థాలు ఉండటంతో మంటలు మరింత వేగంగా వ్యాపించాయి.

రూ.100 కోట్ల మేర ఆస్తినష్టం
ఈ కారణంగా అగ్నిమాపక సిబ్బందికి మంటలను నియంత్రించడం కష్టంగా మారింది.
ఘటన సమయంలో గోదాంలో సెక్యూరిటీ సిబ్బంది తప్ప ఎవరూ లేకపోవడంతో పెను ప్రాణాపాయం తప్పింది. ఈ గోదాంలో సుమారు 300 మంది కార్మికులు పనిచేస్తుంటారు.
అయితే ఈ ఘటనలో దాదాపు రూ.100 కోట్ల మేర ఆస్తినష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాలు. ఐటీసీ ఉత్పత్తులను ఈ గోదాంలో నిల్వ చేయడం ద్వారా ఒడిశా నుంచి తూర్పు గోదావరి వరకు సరఫరా చేస్తుంటారు.
ఇంత పెద్ద స్థాయిలో స్టాక్ ఉన్న ప్రాంతంలో ఇలాంటి అగ్నిప్రమాదం జరగడం ఆందోళనకరంగా మారింది. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి కారణాలపై అధికారులు విచారణ ప్రారంభించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు