Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

కేతమన్నేరు వాగు వంతెనపై భారీ గుంతలు

మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లి గ్రామం వద్ద నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై కేతమన్నేరు వాగు పై నిర్మించిన వంతెనపై భారీ గుంతలు ఏర్పడి వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. నిత్యం వందలాది వాహనాలు ఈ జాతీయ రహదారిపై రాకపోకలు సాగిస్తూ ఉండటంతో వంతెన నిర్మాణం లో నాణ్యత పాటించకపోవడంతో వంతెన ప్రమాదకర స్థితికి చేరుకుందని వాహనదారులు ఆరోపిస్తున్నారు. వంతెన నిర్మాణంలో నాణ్యత ప్రమాణలు పాటించానందువలనే వంతెనపై భారీగా గుంతలు ఏర్పడ్డయని వాహనదారులు విమర్శిస్తున్నారు .నాసిరకం గల సిమెంటు, కంకర తొలగిపోయి ఇనుప కంబీలు బయటికి కనిపిస్తుండడంతో ఇటీవల కొందరు వాహనదారులు ప్రమాదానికి గురై గాయాల పాలయ్యారు. రాత్రిపూట ఈ వంతెనపై ప్రయాణం చేసే వాహనదారులు కొంచెం ఆజాగ్రత్త మరిచిన వాహనాలు 50అడుగుల లోయలో పడిపోయి భారీ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇకనైనా నేషనల్ హైవే అథారిటీ అధికారులు వాహనదారుల భద్రతను దృష్టిలో పెట్టుకొని వంతెనపై శాశ్వత మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img