Monday, May 6, 2024
Monday, May 6, 2024

మునుగోడులో ఎగిరేది గులాబీ జెండానే : మంత్రి తలసాని

మునుగోడులో టీఆర్‌ఎస్‌ ప్రజా దీవెన సభకు మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు పెద్దఎత్తున తరలి వెళ్తున్నారు. నగరం నుంచి మునుగోడుకు వెళ్తున్న భారీ కాన్వాయ్‌కి నెక్లెస్‌ రోడ్‌ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. మునుగోడులో విజయం టీఆర్‌ఎస్‌ పార్టీదేనని స్పష్టం చేశారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని చెప్పారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే చేతకానితనం వల్లే ఉప ఎన్నిక వచ్చిందని విమర్శించారు. మునుగోడులో ఎగిరేది గులాబీ జెండా ఎగరడం తథ్యం అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img