Friday, April 26, 2024
Friday, April 26, 2024

అన్నదాతకు అడుగడుగునా మోసం

పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
డిమాండ్లు పరిష్కారమయ్యేంత వరకు ఆందోళన ఆగదు
హైదరాబాద్‌ మహా ధర్నాలో రైతు నేతలు

విశాలాంధ్ర`హైదరాబాద్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతలను నిలువునా మోసగిస్తున్నాయని అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి(ఏఐకెేఎస్‌సీసీ) జాతీయ నాయకులు విమర్శించారు. దిల్లీ వీధుల్లో రైతు సమస్యలపై ఒక సంవత్సర కాలం పోరాటం చేయడం పాలకుల పనితీరుకు సిగ్గుచేటు అని, వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడిరచి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రైతు వ్యతిరేక చట్టాల రద్దుతోనే తమ ఉద్యమం ఆగిపోలేదని, ప్రతి సమస్య పరిష్కారమై, అన్నీ తేల్చుకున్న తర్వాతనే తాము ఢల్లీి నుంచి ఇంటి బాట పడుతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతు ఉద్యమం ప్రారంభమై ఒక సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ఏఐకెేఎస్‌సీసీి, సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కెేఎం) సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌ వద్ద గురువారం మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఏఐకెేఎస్‌సీసీి రాష్ట్ర కన్వీనర్లు పశ్యపద్మ, టి.సాగర్‌, రాయల చంద్రశేఖర్‌, ఉపేందర్‌ రెడ్డి, అచ్యుతారామారావు, జక్కుల వెంకటయ్య, విస్సా కిరణ్‌ ,జాతీయ వర్కింగ్‌ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య అధ్యక్షత వహించారు. ఈ సభకు బీకేయూ నాయకులు రాకేశ్‌ తికైత్‌, ఏఐకెేఎస్‌ ప్రధాన కార్యదర్శి అతుల్‌ కుమార్‌ అంజన్‌, ఏఐకెేఎస్‌ ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మొల్ల, ఏఐకెేఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి అశిష్‌ మిట్టల్‌, భూమి బచావో ముహిం (ఉత్తరఖండ్‌) జగ్తర్‌ బజ్వా హాజరయ్యారు. ఈ ధర్నాకు సంఫీుభావంగా ఏఐటీయూసీ, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ, శ్రామిక మహిళా ఫోరమ్‌, దళిత హక్కుల పోరాట సమితి, తెలంగాణ వ్యవసాయ కార్మికసంఘం నేతృత్వాన ఎన్టీఆర్‌ స్టేడియం వద్ద ప్రదర్శన నిర్వహించారు.
కార్పొరేట్ల కొమ్ముకాస్తున్న మోదీ : అంజన్‌
అటు మోదీ సర్కారు, ఇటు కేసీఆర్‌ ప్రభుత్వం రైతులకు ద్రోహం చేస్తున్నాయని అతుల్‌ కుమార్‌ అంజన్‌ ఆగ్రహం వెలిబుచ్చారు. కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేందుకు మోదీ ప్రభుత్వం దేశ ప్రయోజనాలను పణంగా పెడుతోందని విమర్శించారు. వ్యవసాయరంగాన్ని దెబ్బ తీయడానికే మోదీ సర్కారు మూడు సాగు చట్టాలు తీసుకొచ్చిందన్నారు. రైతుల ఆందోళనతో దిగొచ్చిన మోదీ సర్కారు సాగు చట్టాల రద్దుకు అంగీకరించిందని, మోదీ తన మొండివైఖరి, అహంకారాన్ని వీడి రైతులు డిమాండ్‌ చేస్తున్న దీర్ఘకాలిక సమస్యలన్నింటినీ తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. రైతు సమస్యలు పరిష్కరించేవరకు దేశవ్యాప్తంగా ఆందోనళలు కొనసాగుతాయని అతుల్‌ కుమార్‌ అంజన్‌ స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన కుటుంబంతో ప్రభుత్వాన్ని నడిపిస్తూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను విస్మరిస్తున్నారని మండిపడ్డారు. రైతు సమస్యలను పట్టించుకోకుండా కేసీఆర్‌ కాలక్షేపం కోసం హైదరాబాద్‌`దిల్లీ మధ్య చక్కర్లు కొడుతున్నారని అంజన్‌ ఎద్దేవా చేశారు. రైతు పోరాటానికి ప్రపంచ వ్యాప్తంగా మద్దతు లభించిందని, 23 దేశాలు కూడా సంఫీుభావం వ్యక్తం చేశాయని తెలిపారు. 70ఏళ్లలో ఇంత పెద్ద ప్రజా ఆందోళన లేదన్నారు. రైతు ఉద్యమం దేశ ఐక్యతను భగ్నంచేసే శక్తులకు వ్యతిరేక, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యంగ పరిరక్షణ ఉద్యమంగా సాగిందన్నారు.
నడిపించేది ఆర్‌ఎస్‌ఎస్సే : రాకేష్‌ తికైత్‌ :
రైతు సంఘాలతో చర్చించిన సమయంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు మా ప్రశ్నలకు నేరుగా సమాధానం చెప్పేవారు కాదని, పక్క గదిలోకి వెళ్లేవారని రాకేశ్‌ తికైత్‌ అన్నారు. ఆ గదికి ప్రధానమంత్రి కార్యాలయం(పిఎంఒ)కు లింక్‌ ఉన్నదని, అక్కడి నుంచి నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌స్‌ కార్యాలయానికి లింక్‌ ఉన్నదని, వారి ద్వారానే సమాధానాలు వచ్చేవని తెలిపారు. కొన్ని మీడియా సంస్థలకు కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ ద్వారానే ప్రశ్నలు వచ్చేవని, ఆ ప్రశ్నలనే తమను అడిగే వారని వివరించారు. రైతు సమస్యలపై పార్లమెంట్‌లో ప్రస్తావించేవారే కరువయ్యారని, ఇక నుంచి సంయుక్త కిసాన్‌ మోర్చా ఏజెండా అంశాలను పార్లమెంట్‌లో ప్రస్తావించే ఎంపిలు మాత్రమే ఉంటారని, లేదంటే వారు పార్లమెంట్‌కు మరోసారి రారని(గెలవరని) హెచ్చరించారు. వచ్చే పార్లమెంటు సమావేశంలో రైతుల అంశాలతో పాటు, పెరుగుతున్న నిత్యావసర ధరల , ఐదు గ్రాముల వరకు డ్రగ్స్‌ కలిగి ఉండేందుకు తీసుకవచ్చే చట్టం, ఇంకా అనేక ప్రజల అంశాలపై చర్చించాలని సూచించారు. రైతు సమస్యల పరిష్కారానికి కమిటీ వేయాలని,అందులో తాము సభ్యులుగా ఉండాలని, పాలసీపై చర్చించాలన్నారు. విత్తనబిల్లు తీసుకు రాకుండా ప్రైవేటు కంపెనీలకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. ఒకరిని మాత్రం హైదరాబాద్‌ నుంచి బయటకు రానివ్వదొద్దని, వస్తే అక్కడికొచ్చి బీజేపీకి మద్దతిస్తారని, అందుకే ఆ నాయకుడిని హైదరాబాద్‌లోనే కట్టివేయాలని పరోక్షంగా ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీని ఉద్దేశించి అన్నారు. ఎన్నికల్లో బిజెపిని ఓడిరచాలని కోరుతామని, గతంలో పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో కూడా ఇలాగే పిలుపునిచ్చామన్నారు. ఇక నుంచి దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల సమస్యలపై ఉద్యమిస్తామని తెలిపారు.
హన్నన్‌ మొల్ల మాట్లాడుతూ మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రుల కమిటీ ఛైర్మన్‌గా రైతులకు కనీస మద్దతు ధర కావాల్సిందేనని తీర్మానించి, ఆ నివేదిక నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు మోదీ అందజేశారని గుర్తు చేశారు. అశిశ్‌ మిట్టల్‌ మాట్లాడుతూ పెట్రోల్‌, డీజిల్‌ ధరల తగ్గింపు, కనీస మద్ధతు ధరల చట్టం కోసం దక్షిణాది రాష్ట్రాలలో కూడా ఉద్యమం చేపట్టాలని, అందుకు జిల్లాల వారీగా ప్రజలను సమీకరించాలని కోరారు. జగ్తార్‌ బజ్వా మాట్లాడుతూ ప్రజలలో చైతన్యం వస్తుందనే భయంతోనే ప్రధాని మోడీ నల్ల చట్టాలను రద్దు చేశారన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్‌ బోస్‌, సీపీఐ మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈటీ నరసింహ, పల్లా నరసింహారెడ్డి, శ్రామిక మహిళా ఫోరమ్‌ రాష్ట్ర కన్వీనర్‌ ప్రేమ్‌ పావని, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి.వెంకటేశం, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏసురత్నం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కె.కాంతయ్య, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.ఛాయాదేవి, నాయకులు సహనా అంజుమ్‌, జ్యోతి, ఏఐటీయూసీ నగర నాయకులు కమతం యాదగిరి, నిర్లేకంటి శ్రీకాంత్‌, ఆర్‌.మల్లేశ్‌, సీహెచ్‌.జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img