Friday, April 26, 2024
Friday, April 26, 2024

కీలుబొమ్మలు

కేంద్ర ఏజెంట్లుగా గవర్నర్ల వ్యవహారం

. రాష్ట్ర అధికారాల హననమే లక్ష్యం
. పరిపాలనలో తలదూర్చి… బిల్లులు ఆమోదించని వైనం
. తమిళనాడు, తెలంగాణ, కేరళలో ఇదే పరిస్థితి
. గవర్నర్‌ పదవి రద్దు దిశగా ఎల్డీఎఫ్‌ కసరత్తు

దేశంలోని అనేక రాష్ట్రాల్లోని గవర్నర్లు కేంద్రప్రభుత్వ కీలుబొమ్మల్లా వ్యవహరిస్తున్నారు. మోదీ సర్కార్‌ ఆడిరచినట్లు ఆడుతూ రాష్ట్ర పరిపాలన వ్యవహారాల్లో తలదూర్చుతూ అక్కడి ప్రభుత్వాలకు ముఖ్యంగా విపక్షాలు అధికారంలో ఉంటే మరీ ఎక్కువగా సమస్యలు సృష్టిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలనూ హరించే ప్రయత్నం చేస్తున్నారు. శాసనసభలు, కేబినెట్‌ ఆమోదించిన బిల్లులపై సంతకాలు చేయకుండా నిరంకుశంగా, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ, కేరళలో ఇదే తరహా పరిస్థితులు కొనసాగుతున్నాయి.

న్యూదిల్లీ: రాజ్యంగబద్ధ గౌరవమైన స్థానానికి నియమితులయ్యే గవర్నర్లు కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి ఏజెంట్లుగా మారుతుండటంతో ముఖ్యంగా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో రాజకీయ అనిశ్చితి సృష్టించేందుకు ఈ వ్యవస్థ దుర్వినియోగం అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గవర్నర్‌ వ్యవస్థ నియంతృత్వానికి అద్దం పడుతోంది. కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో గవర్నర్లకు అక్కడి ప్రభుత్వాలకు మధ్య వివాదం చాలారోజులుగా కొనసాగుతోంది. గవర్నర్లు కేంద్రం ఆడిరచినట్లు అడుతున్నారని మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు విమర్శిస్తూనే ఉన్నాయి. కీలక శాసనాలు, పరిపాలన విధానాలకు ఆటంకాలు కలిగిస్తూ మోదీ కీలుబొమ్మల్లా, ఏజెంట్లుగా గవర్నర్లు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించాయి. దీంతో బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలు ఏకమవుతున్నాయి. కేరళ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలోని ప్రభుత్వాలు తమ గవర్నర్లకు వ్యతిరేకంగా అనేక ఆందోళనలు, ప్రదర్శనలు, నిరసనలను తలపెట్టాయి.
తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌందరాజన్‌ తీరును తమిళనాడులోని అధికార డీఎంకే తప్పుపట్టింది. ఆమె తమ రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవడాన్ని ఖండిరచింది. గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించకుముందు తమిళనాడు బీజేపీ సీనియర్‌ నేతగా ఉన్న తమిళసైపై తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు, అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో నియామకాలపై వివాదంతో గొడవ ముదిరింది. పార్టీ అగ్ర రాజకీయ కుటుంబానికి తెలుగు మూలాలు ఉన్నట్లు తమిళసై చేసిన వ్యాఖ్యలపై డీఎంకే అధికార పత్రిక ‘మురాసోలి’ మంగళవారం స్పందించింది. ‘తమిళనాడు రాజకీయాల్లో తెలంగాణ గవర్నర్‌ జోక్యం చేసుకోరాదు. అది ఆమె పని కాదు. రాజీనామా చేశాక తమిళనాడులో రాజకీయాలు చేయొచ్చు’ అని పేర్కొంది. తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎస్‌ రవి తన అధికార పరిధిని మరిచి వ్యవహరిస్తూ తీవ్ర గందరగోళానికి దారితీసే వ్యాఖ్యలు చేస్తుంటారని ఎద్దేవా చేసింది. రాజకీయ, న్యాయ పరిధికి తమిళసై కట్టుబడాలని సూచించింది. డీఎంకే ఈనెలారంభంలో భావసారూప్యతగల పార్టీల ఎంపీలకు ఓ లేఖ పంపి గవర్నర్‌ రవిని పదవి నుంచి తొలగించేందుకు సహకరించాలని కోరింది. ఆయన రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొంది. ఈ అత్యున్నత పదవికి అర్హుడు కాదని ఆయన మాటలు, చేతలతో రుజువు అవుతున్నట్లు దుయ్యబట్టింది. 20కుపైగా బిల్లులు గవర్నర్‌ వద్ద పెండిరగ్‌లో ఉన్నట్లు వెల్లడిరచింది. తెలంగాణలోనూ అధికార టీఆర్‌ఎస్‌కు గవర్నర్‌ తమిళసైకి మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. యూజీసీ నిబంధనల ప్రకారం 15 తెలంగాణ వర్సిటీల ఉమ్మడి నియామక బోర్డు దిశగా చర్చలకుగాను రాష్ట్ర విద్యా మంత్రి సబితా ఇందిరా రెడ్డికి తమిళసై సమన్లు జారీచేశారు. ఇప్పటికే గవర్నర్‌ ఆమోదం కోసం ఎనిమిది బిల్లులు పెండిరగ్‌లో ఉండగా వైద్య వర్సిటీ మినహా అన్నిచోట్ల టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులో నియామకాల కోసం బిల్లును టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పంపింది. దానిపై సంతకం చేసేందుకు తమిళసై నిరాకరించడం తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులకు కోపం తెప్పించింది. గవర్నర్‌ కేంద్రం కీలుబొమ్మ అంటూ విమర్శిస్తూ బుధవారం రాజ్‌భవన్‌ వరకు మార్చ్‌కు వారు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్‌ను పాటించడం లేదని తమిళసై ఆరోపించారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా తనను ప్రసంగించనివ్వలేదని, అసెంబ్లీ ఉమ్మడి సమావేశంలోనూ మాట్లాడే అవకాశామివ్వలేదన్నారు. ఇందుకు కౌంటర్‌గా గవర్నర్‌ కోటా కింద ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ నేత కౌశిక్‌ రెడ్డి నియామకానికి కేబినెట్‌ తీర్మానంపై సంతకం చేసేందుకు తమిళసై నిరాకరించారు.
కేరళలోనూ గవర్నర్‌కు ఎల్డీఎఫ్‌ ప్రభుత్వానికి మధ్య ప్రచ్చన్న యుద్ధమే జరుగుతోంది. కీలకమైన శాసనాన్ని గవర్నర్‌ నిరాకరిస్తున్నట్లు పాలకపక్షం పేర్కొంది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వీసీల రాజీనామాలకు ఆదేశాలు జారీ చేయడం నిరంకుశత్వమని విమర్శించింది. గవర్నర్‌ పదవిని రద్దు చేయాలని సీపీఎం డిమాండు చేసింది. ఇదే విషయమై చర్చించేందుకు దిల్లీలో వివిధ పార్టీలతో భేటీలకు కరసత్తు చేస్తోంది. కేబినెట్‌ ఆమోదించిన బిల్లులపై సంతకాలకు గవర్నర్‌ నిరాకరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఎల్డీఎఫ్‌ భావిస్తోంది. కేబినెట్‌ లేదా శాసనసభ నిర్ణయాలపై అప్పిలేట్‌ అధికారిగా గవర్నర్‌ ఉండేందుకు వీల్లేదని పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వ అధికారుల అతిక్రమణకే : పినరయి విజయన్‌
రాష్ట్ర ప్రభుత్వ అధికారుల అతిక్రమణ కోసం గవర్నర్లను కేంద్రం వాడుతోందని, ముఖ్యంగా బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉండి అక్కడ ‘హార్స్‌ట్రేడిరగ్‌’ (ఫిరాయింపులు)కు తావులేని రాష్ట్రాల్లో ఇలా ఎక్కువగా జరుగుతోందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విమర్శించారు. అనేక రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులను బుజ్జగించి తమ పార్టీలో చేర్చుకునే యత్నాలు సాగుతున్నాయి. ధరలు అమితంగా పెరిగిన క్రమంలో ‘హార్స్‌ట్రేడిరగ్‌’లో హార్స్‌కు బదులు వేరొక పదాన్ని వినియోగించాలేమో! ఫిరాయింపులు సాధ్యం కాని చోట గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగమవుతోంది. ఆ పదవిని అస్త్రంగా మార్చుకొని అక్కడి ప్రభుత్వాల అధికారాలను హరించే ప్రయత్నం జరుగుతోంది’ అని విజయన్‌ వ్యాఖ్యానించారు. ఆయన మంగళవారం ఇస్రో స్టాఫ్‌ అసోసియేషన్‌ స్వర్ణోవత్సవాల ప్రారంభోత్సవంలో మాట్లాడారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img