Friday, April 26, 2024
Friday, April 26, 2024

మోగిన బడి గంట

నూతన విద్యావిధానం అమలు
3,627 పాఠశాలల విలీనం
విద్యార్థులకు కిట్ల పంపిణీ

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా చాలాకాలంగా పాఠశాలల తరగతులు నిలిచిపోయిన విషయం విదితమే. 202122 విద్యా సంవత్సరానికిగాను బడులు తెరిచారు. కరోనా నిబంధనల నడుమ 110 విద్యార్థులకు తరగతులు ప్రారంభించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు మాస్క్‌, భౌతికదూరం, థర్మల్‌ స్క్రీనింగ్‌ సౌకర్యాలను తప్పనిసరి చేశారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పాఠశాలలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గదుల కొరత ఉన్న పాఠశాలల్లో రెండు విడతలుగా తరగతుల నిర్వహణకు విద్యాశాఖ మార్గదర్శకాలు జారీజేసింది. అటు మొదటి విడత నాడునేడులో ఆధునీకరించిన పాఠశాలలను తూర్పుగోదావరి జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించి, వాటిని విద్యార్థులకు అంకితం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జగనన్న విద్యాకానుక కింద విద్యార్థులకు కిట్లను పంపిణీ చేశారు. పాఠశాలలకు వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు, సిబ్బంది పంపిణీ చేశారు. పాఠశాలలతోపాటు జూనియర్‌ కళాశాలలు ప్రారంభమయ్యాయి. దీంతో ఆయా విద్యాసంస్థల పరిసర ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో నూతన విద్యావిధానాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం ప్రారంభించింది. దీంతో 3,627 ప్రాథమిక పాఠశాలలను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. గతంలో ఉన్న పాఠశాల విద్యావ్యవస్థ స్వరూపం పూర్తిగా మారిపోయింది. పాఠశాల విభజన ఆరు విభాగాలుగా ఉంది. ప్రస్తుతమున్న 10G2 విధానం స్థానంలో 5G3G3G4 విధానం అమల్లోకి వచ్చింది. ప్రాథమిక పాఠశాలల్లో ఇకనుంచి ప్రీ ప్రైమరీ-1, ప్రీ ప్రైమరీ-2, ప్రిపరేటరీ ఫస్ట్‌క్లాస్‌, 1వ తరగతి, 2వ తరగతితో ఉంటాయి. వీటిని ఫౌండేషన్‌ స్కూళ్లుగా పిలుస్తారు. ఉన్నత పాఠశాలల్లోకి 3 నుంచి 10 తరగతులను విలీనం చేశారు. ఎంపిక చేసిన మండలాల్లో అవసరానికి అనుగుణంగా ఇంటర్మీడియట్‌ విద్యను(G2) కలుపుతారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img