Friday, August 12, 2022
Friday, August 12, 2022

పోరాటమే ఊపిరిగా కొనసాగిస్తాం

. నిమిషమైన రాష్ట్రాన్ని పాలించే అర్హత జగన్ కు లేదు
. ఏపీకి రావలసిన హక్కులు సాధించడంలో జగన్ సర్కార్ విఫలం
. ఐదుకోట్ల ప్రజల మనోభావాలను ఢిల్లీకి తాకట్టు పెట్టిన గా ఘనుడు జగన్
. ప్రజా పోరాటాలతోనే మోడీ,జగన్ లకు బుద్ది చెబుతాం
. విజయవంతమైన రాజమహేంద్రవరం బహిరంగ సభ
. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ 

విశాలాంధ్ర-రాజమహేంద్రవరం/రాజానగరం:  పోరాటమే ఊపిరిగా భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) ప్రతినిత్యం ప్రజల తరపున పోరాటాలు చేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు.సిపిఐ 25వ జిల్లా మహాసభలను పురస్కరించుకుని జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరంలోని కోటిపల్లి బస్టాండ్ వద్ద సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాటి మధు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ ఒక్క నిమిషమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించే అర్హత ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డికి లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.కేంద్ర,రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు అల్లాడి పోతుంటే మరోపక్క రాష్ట్రానికి రావలసిన హక్కులను సాధించడంలో జగన్ సర్కార్ విఫలమైందని మండిపడ్డారు.ఇటువంటి సీఎంని తాను ఇంత వరకు ఎన్నడు చూడలేదన్నారు.తన చేతకాని తనంతో పోలవరం నిర్మాణాన్ని, నిర్వాసితుల్ని గోదావరిలో ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు.ఆంధ్ర రాష్ట్రంలోని ఐదు కోట్ల ప్రజల హక్కులను, మనోభావాలను ఢిల్లీకి తాకట్టు పెట్టిన ఘనుడుగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు. పోరాటాలు చేసేవారిని అనగతొక్కే విధానం సరికాదని హితవుపలికారు. కమ్యూనిస్టులకు అడ్డగా ఉన్న విజయవాడలో అడుగు పెట్టనివ్వం అనడానికి ముఖ్యమంత్రి జగన్ కి ఎవరు ఇచ్చారు హక్కు అని నిలదీశారు. విజయవాడ నీ యబ్బా జగిరా అని మండిపడ్డారు.చలో విజయవాడ విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు.దేశ ప్రధానిగా మోదీ 2014 లో బాధ్యతలు చెప్పటిన నాటికి 47 లక్షల కోట్లు అప్పు ఉండగా నేడు సుమారు 147 లక్షల కోట్లుకి తీసుకువెళ్లారని ఆవేదన వ్యక్తంచేశారు.26 ప్రభుత్వ రంగాలను ప్రవేట్ వ్యక్తులకు అమ్మకానికి పెట్టడం దారుణమన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగుల ఇస్తామన్న మోది ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చేరో తేటతెల్లం అయ్యిందన్నారు.ఆర్ఎస్ఎస్,బీజేపీ వ్యతిరేక శక్తులపై పోరాడే శక్తి సీపీఐకి మాత్రమే ఉందన్నారు. రాజమహేంద్రవరంలో మొదటి శాసనసభ్యులుగా సీపీఐ పార్టీ నేత చిత్తూరు ప్రభాకర చౌదరి అని గుర్తుచేశారు. అల్లూరి పోరాట స్ఫూర్తితో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల పై ఉద్యమిస్తామని బాణం తీసి విల్లంబు గురి పెట్టారు.ప్రజా పోరాటాలతో మోడీకి ,జగన్ లకు బుద్ది చెబుతామని హెచ్చరించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రావుల వెంకయ్య మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల పాలనకు చరమగీతం పడే సమయం ఆసన్నమైందన్నారు. అందుకు సీపీఐ ప్రజా పోరాటాలు చేసేందుకు సన్నాహాలు చేపట్టిందని,ప్రజలు సహకరించాలని కోరారు.కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు చేపట్టిన పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు స్వస్తి పలకాలన్నారు.భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోదీ పాలన చెప్పటిన 8ఏళ్ళు కాలంలో ఎవత్తు ప్రజానీకాన్ని అన్నిరకాలగా ఇబ్బందులు గురిచేస్తు న్నరన్నారు.ప్రజా సంఘాలు,ప్రజలు అనేక ఉద్యమాలు చేసి సాధించుకున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు,పరిశ్రమలు, విశాఖ ఉక్కు కర్మాగారం తదితర వాటిని ప్రైవేట్ కొటేశ్వరులకు ధారా దత్తం చేసే విధానాలు అమలు జరుగుతున్నాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని,రాజ్యాంగ విధానాలను తుంగలో తొక్కియడంతో పాటు వారికి అనుకూలమైన రాష్ట్ర ప్రభుత్వాలను కీలు బొమ్ములుగా చేసి అడిస్తున్నారని ఎద్దేవాచేశారు.ఏపీకి సంబంధించి విభజన హామీలు అమలుచేయకుండా నిరంకుశ వైఖరి అవలంభిస్తున్నారని మండిపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి గడిచిన 3ఏళ్లలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా అప్పుచేసి పప్పు కుడు అన్న చందాన వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు యవత్తు పార్టీలు,వామపక్షాలు, ప్రజాతంత్ర లౌకికవాదులు ఏకం కావాల్సిన తరుణం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఇందుకు సీపీఐ చొరవ తీసుకుంటున్నట్లు తెలిపారు.తొలుత పార్టీ అమరవీరులు కామ్రేడ్ చిట్టూరి ప్రభాకర్ చౌదరి, కామ్రేడ్ మీసాల సత్యనారాయణ ,కామ్రేడ్ కేత అప్పారావు,శెట్టి లత్సాలు నివాసాల వద్ద నుండి అమరవీరుల జెండాలను తీసుకొచ్చి సిపిఐ రామకృష్ణ అందజేశారు.రాష్ట్ర పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముప్పాల సుబ్బారావు మాట్లాడుతూ టీడీపీ,వైసీపీ వంటి పార్టీలు కేవలం రాష్ట్రానికే పరిమితం అని ఎర్ర జెండాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయన్నారు. ఈ సభలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి,జట్లు సంఘం అధ్యక్షులు కొండ్రపు రాంబాబు,పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి రేఖ భాస్కర రావు,సిపిఐ నగర కార్యదర్శి వి.కొండలరావు, మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు నల్లా భ్రమరాంబ, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.లోవరత్నం, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్,సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నల్ల రామారావు,సిపిఐ నగర సహాయ కార్యదర్శులు సప్పా రమణ,శిడగం నౌరోజీ,రైతు సంఘం జిల్లా కన్వీనర్ జ్యోతిరాజు, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు ఎస్.సూరిబాబు, ప్రజానాట్యమండలి జిల్లా కన్వీనర్ మహంతి లక్ష్మణరావు,జిల్లా నుండి వివిధ మండలాల నుండి పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img