Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

లారీలో 100కి పైగా పేలిన గ్యాస్‌ సిలిండర్లు

ప్రకాశం జిల్లా కొమరోలు సమీపంలో పేలిన గ్యాస్ సిలిండర్ లారీ – తప్పిన ముప్పు

విశాలాంధ్ర. : కోమారోలు. ప్రకాశం జిల్లా లోని కొమరోలు సమీపంలోని దద్దవాడ వద్ద భారీ గ్యాస్ పేలుడు ప్రమాదం చోటుచేసుకుంది. అనంతపురం గుంటూరు జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రమాదం చోటుచేసుకుంది లారీలో 300 పైగా లోడుతో ఉలవపాడు వస్తుండగా కొమరోలు సమీపంలో లారీ షార్ట్ సర్క్యూట్ కు మంటలు చెలరేగాయి దీన్ని గమనించిన లారీ డ్రైవర్ లారీని ఆపి దూకి బయటకు వెళ్లారు. అనంతరం గ్యాస్ సిలిండర్లకు మండల అనుకొని సిలిండర్ తో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. లారీలో ఉన్న 100 సిలిండర్లు పైగా ఫెయిలాయి. ముందుగా పోలీసులు అక్కడ చేరుకొని రోడ్డుకు అటు, ఇటు కిలోమీటర్ వైపు ట్రాఫిక్ ను నిలుపుదల చేశారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేయటంతో ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదు మంటల్లో లారీ పూర్తిగా దగ్ధమైంది ఒకసారిగా అర్ధరాత్రి మంటలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అసలు ఏమి జరిగిందని రోడ్లమీదకు జనం పరుగులు తీశారు లారీ డ్రైవర్ అప్రమత్తం చాకచక్యంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img