Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరం: ఎంపీడీఓ నాగేశ్వరరావు

గుడ్లూరు : ప్రస్తుతం అడపాదడపా వర్షాలు కురుస్తూ ఉండటం, దానికి తోడు వాతావరణంలో మార్పులు ఏర్పడుతూ ఉండటంతో సీజనల్‌ వ్యాధులు ప్రభలే అవకాశాలు మెండుగా ఉన్నాయని, కాబట్టి గ్రామాల్లో విధిగా శానిటేషన్‌ చేయిస్తూ, పరిశుభ్రతను పాటించేలా చూడాలని ఎంపీడీఓ కె.నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని అమ్మవారిపాలెం, అడవిరాజుపాలెం, చినలాటిరిఫి గ్రామాల్లో గల సచివాలయాలను ఎంపీడీఓ శనివారం ఆకస్మిక తనికీ నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన సచివాలయాలలో గల మూమెంటరీ రిజిష్టర్‌, వాలంటీర్‌ రిజిష్టర్‌తో పాటు పలు రిజిస్టర్లను మరియు హాజరు పట్టీని పరిశీలించారు. సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించడంతో పాటు, ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి పూర్తి స్థాయిలో తీసుకువెళ్లాలని సూచించారు. థర్డ్‌ వేవ్‌ ప్రభావం మొదలైనందున గ్రామాల్లో కోవిడ్‌ నిబంధనలు పారించేలా చూడాలని, నిబంధనలు అతిక్రమించే వారిపై జరిమానాలను తప్పక విధించాలన్నారు. అనంతరం గ్రామంలో గల పలు వీధులను పరిశీలించి, పరిశుభ్రత, కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ గురించి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఆశ కార్యకర్తలు, ఏ.ఎన్‌.ఎం లు గ్రామాల్లో విధిగా ఇంటింటికి పర్యటించి, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీలు మహేష్‌, నరేష్‌, మరియు అంగన్వాడీ కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, సర్పంచులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img