Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఒమిక్రాన్‌ ఎప్పుడైనా దేశంలోకి రావొచ్చు..

ప్రజలు కొవిడ్‌ నిబంధనలు తప్పక పాటించాలి
డీహెచ్‌ శ్రీనివాసరావు

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇప్పటికే పలు దేశాలకు శరవేగంగా విస్తరించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు పలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.ఇవాళ మధ్యాహ్నం డీహెచ్‌ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ముప్పు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందని వెల్లడిరచారు. ప్రజలు కొవిడ్‌ నిబంధనలు తప్పక పాటించాలని కోరారు. ఒమిక్రన్‌ ఇప్పటికే వ్యాప్తి ఎక్కువగా ఉందని.. ఇప్పటికే 24 దేశాలు నుంచి కేసులు వస్తున్నాయని వెల్లడిరచారు. ఈ వేరియంట్‌ ప్రవర్తన మనం పాటించే కొవిడ్‌ నిబంధనల మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు. తగిన జాగ్రత్తలు పాటించకపోతే ఇప్పుడు సోషల్‌మీడిమాలో వస్తున్న అసత్య ప్రచారాలు వాస్తవమవుతాయని తెలిపారు.నిన్న విదేశాల నుంచి వచ్చిన వారికి చేసిన పరీక్షల్లో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్‌ రావు వెల్లడిరచారు. ఆ వ్యక్తిని టిమ్స్‌లో చేర్చి చికిత్స అందిస్తున్నాని, అతని నమూనాలను జీనోమ్‌కు పంపాం. ఫలితాలు వచ్చాక ఒమిక్రానా కాదా అనేది తెలుస్తుంది. అని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఆయన స్పష్టం చేశారు. మాస్కు ధరించడంతో పాటు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img